Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎవరి సింపతీ అక్కరలేదు.. ధర్మేంద్ర, బెల్లంకొండ సురేష్ అలా కష్టపడ్డారు.. నారాయణమూర్తి
బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యానర్ పై ప్రముఖ కమెడియన్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా కృష్ణారావ్ సూపర్‌మార్కెట్ టీజర్ ప్రసాదర్‌ల్యాబ్‌లో ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీనాధ్ పులకరం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పలువురు ప్రముఖులు మాట్లాడారు.
హీరో సుమన్ మాట్లాడుతూ...నా పక్కన ఓ గొప్ప వ్యక్తి నుంచున్నారు నాకు చాలా గర్వంగా ఉంది. 30 సినిమాలకు పైగా ప్రొడ్యూసర్ చేసిన ఆయనతో ఈ రోజు స్టేజ్ మీద నిలబడడం చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా భరణిలాంటి పెద్ద వాళ్ళతో ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. గౌతమ్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా అని చెప్పగానే ఎందుకు ఇంత రిస్క్ చేశావ్ అని అన్నాను. నేను నా కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యాలనుకున్నాను. అది నా కోరిక అన్నారు. ఇందులో ఒక సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. రెండున్నరగంటలు సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు తెరకెక్కించాడు. మీ అందరి ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలని అందరూ ఈ సినిమాని బాగా ప్రమోట్ చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను అని అన్నారు.
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ... ఆర్ నారాయణమూర్తిగారు మంచి నీళ్ళలాంటి వాళ్ళు. అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. సినిమా అనేది చాలా పెద్ద యజ్ఞం లాంటిది. ఎన్నో కష్టాలు పని ఈ సినిమాని తీసని డైరెక్టర్‌కి నా అభినందనలు తెలుపుతున్నాను. నెక్స్ట్ సీన్ ఏంటి అని ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీని కలిగించేలా దర్శకుడు ఈ చిత్రాన్నితెరకెక్కించాడు. గౌతంరాజు కోసం ఇంత మంది వచ్చారు. ఈ సినిమాలో అన్ని పాత్రలు చాలా బాగా కుదిరాయి. చిన్న సినిమాలలోనే మాకు చాలా ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయి. మాకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఖచ్చితంగా అందరూ ఈ సినిమాని చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ... కృష్ణారావ్ సూపర్ మార్కెట్ సినిమా చూశాను నాకు చాలాబాగా నచ్చింది. తనికెళ్ళభరణిగారు సరస్వతి పుత్రుడు. అల్లు అరవింద్‌గారు నా శ్రేయోభిలాషి. గౌతమ్‌రాజు నా కొడుకుని హీరో చెయ్యాలని ఆయన చేసే సంకల్పం చాలా గొప్పది. ఆయన ఎవరి డబ్బులు ఉంచుకోరు. సినిమా మంచి హిట్ అవుతది. ఇక్కడ ఎవరి సింపతీ ఎవరికి అక్కరలేదు. డైరెక్టర్ ఈ సినిమాని చాలా గొప్పగా తీశారు. నూతనంగా వచ్చే దర్శకుల్లో మీరు ఎంతో గొప్పస్థాయికి రావాలని కోరుకుంటున్నాను అన్నారు. తండ్రి రుణం తప్పకుండా తీర్చుకోవాలని కృష్ణాని కోరుతున్నాను. తండ్రులు చాలా గొప్పవారు ధర్మేంద్ర తన కొడుకు కోసం చాలా కష్టపడ్డారు. అలాగే బెల్లంకొండ సురేష్ తన కొడుకు కోసం చాలా కష్టపడ్డారు. అలాగే నేడు గౌతమ్ రాజు కూడా ఆయన కొడుకు కోసం ఎంతో కష్టపడ్డాడు అని అన్నారు.
గౌతమ్‌రాజు మాట్లాడుతూ... ఫస్ట్ కాపీ వచ్చేసింది సినిమా చూశాం చాలా బావుంది. సెన్సార్ పనులు అన్నీ పూర్తయిపోయాయి. సినిమా ఇంటర్ వెల్ వరకు ఒక ఎత్తు ఇంటర్వెల్ తర్వాత తల తిప్పరు ఒట్టు. సినిమాని చాలా బాగా తీశారు. ఈ సినిమా కోసం నాకు చాలా మంది హెల్ప్ చేశారు. మార్తాండగారు కూడా చాలా హెల్ప్ చేశారు.
హీరో కృష్ణ మాట్లాడుతూ... చాలా కష్టపడి ఈ సినిమాని తీశాం. మంచి ప్రాజెక్ట్ కోసం బాగా కష్టపడ్డాం. నా కెరియర్‌కి ఇదో మంచి మూవీ అవుతుంది. స్టోరీ అందరికీ చూపించాము. తనికెళ్ళ భరణిగారు కథ చూసి చాలా పాజిటివ్‌గా రెస్పాన్స్ అయ్యారు. ఎడిటర్ బాగా ఎడిట్ చేశారు. ఈ చిత్రంలో ఆరు ఫైట్లు ఉన్నాయి. ఆర్ ఆర్ బాగా కుదిరింది బోలేగారు బాగా సపోర్ట్ చేశారు. సిజి టీమ్ లాల్‌గారు చాలా బాగా కష్టపడ్డారు. నేను చాలా అదృష్టవంతుడ్ని ఇంత మంచి టెక్నీషియన్స్ దొరకడం నా అదృష్టం. ఎల్సా చాలా వండర్ఫుల్ హీరోయిన్. అమ్మ మీ పుట్టినరోజు సందర్భంగా నా విషెస్. అదే విధంగా ఫాదర్స్‌డే సందర్భంగా ఫాదర్స్ అందరికీ నా శుభాకాంక్షలు. మా నాన్నగారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఇది ఇలాగే నిలబెట్టుకోవాలని మీరందరూ నాకు చాలా హెల్ప్ చెయ్యాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు శ్రీనాధ్ పులకురమ్ మాట్లాడుతూ... ఈ సినిమా ప్రారంభమైన మొదట్లో నేను ఒక్కడినే కథ రాసుకున్నాను. తర్వాత గౌతమ్ గారికి కథ వినిపించాను ఆయనకు బాగా నచ్చి ఓకే చెప్పారు. గౌతమ్ గారు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ప్రత్యేక కృతజ్ఞతలు. ఫైట్మాస్ట్ర్ ఫైట్ సీన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. డైరెక్టర్ డిపార్టమెంట్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. హీరో బాగా ఎంతో ఓర్పుతో కష్టపడి చేశారు. ఎల్సా కూడా చాలా బాగా నటించింది. శివ గారు నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. లాంగ్వేజ్ విషయంలో నాకు బాగా హెల్ప్ చేశారు అని అన్నారు.
హీరోయిన్ ఎల్సా మాట్లాడుతూ... ఇది నా మొదటి డెబ్యూ చిత్రం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన గౌతమ్ గారికి డైరెక్టర్‌గారికి, కృష్ణగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు లాంగ్వేజ్ విషయంలో చాలా బాగా హెల్ప్ చేశారు. ప్లీజ్ మీరందరూ తప్పకుండా సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
నటీనటులు
:
కృష్ణ,
ఎల్సా
ఘోష్,
గౌతమ్
రాజు,
తనికెళ్ల
భరణి,
బెనర్జీ,
రవి
ప్రకాష్,
సూర్య,
సనా
తదితరులు.
సాంకేతిక
నిపుణులు
:
ప్రొడ్యూసర్
:
BGR
ఫిల్మ్
అండ్
టీవీ
స్టూడియోస్
డైరెక్టర్: శ్రీనాథ్ పులకురమ్
డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ: ఏ.విజయ్ కుమార్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్: బోలె షావలి
ఫైట్స్ : సింధూరం సతీష్
ఆర్ట్: ఎమ్.ఎస్.వాసు
ప్రాజెక్ట్ అడ్వైజర్ : కే. భువన్ రెడ్డి