తెలుగు సినిమాల్లో మైక్ టైసన్.. ఓటు వేయని వారికి.. అంటూ నారాయణమూర్తి షాకింగ్ కామెంట్స్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఎన్నికలు వచ్చాయి. నా ఓటును నేను వినియోగించుకొన్నాను. ఈ ఎన్నికల్లో ఎవరు నెగ్గినా వారికి ఓట్లు వేసిన వారికి ఎంత న్యాయం చేస్తారో.. ఓట్లు వేయని వారికి కూడా అంతే న్యాయం చేయాలి. తెలుగు సినీ పరిశ్రమకు, కళాకారులకు తగిన న్యాయం చేయాలి నటుడు నారాయణమూర్తి అన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమ ప్యాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను మన దర్శకులు రూపొందిస్తున్నారు. పూరీ జగన్నాథ్ లాంటి వాళ్లు అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్‌తో నటింప చేయిస్తున్నాడు. అది మనకు గర్వకారణం. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న తెలుగు జాతి కళాకారులు ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నారు. కన్న కలలు నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు అని నారాయణమూర్తి తెలిపారు.

భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాలను పైకి తెచ్చేందుకు కొన్ని రిజర్వేషన్లు పెట్టారు. అలాంటి పద్దతులను అవలంబిస్తూ తెలుగు కళాకారులకు అవకాశాలు కల్పించాలి. లక్షలాది మంది గొప్పవాళ్లం కావాలని కలలు కంటున్న వారికి కలలు నెరవేర్చాలి. అవకాశాలు లేని వారికి అవకాశాలు కల్పించాలి. మీరు ఎలాంటి వ్యాపారాలు పెట్టుకొన్నప్పటికి.. తెలుగు కళాకారులను ఆదరించాలి అని అన్నారు.

R Nayarana Murthy made interesting comments on MAA Elections

మా ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశారనే ప్రశ్నకు నేను చెప్పను. మనది సీక్రెట్ బ్యాలెట్. అందుకే ఓటు ఎవరికి వేశాననే విషయం చెప్పడం మంచిది కాదు అని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, సాధారణంగా పోలింగ్‌ను 2 గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే షూటింగుల్లో ఉన్న వాళ్లు, ఇతర కారణాల వల్ల పోలింగ్‌ను మూడు గంటల వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు. రెండు గంటల వరకు దాదాపు 550కిపైగా ఓట్లు నమోదయ్యాయయి అని పోలింగ్ అధికారులు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X