సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట్లో విషాదం.. మాతృవియోగంతో పుట్టెడు దు:ఖంలో..
దక్షిణాదిలో స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట్లో విషాదం చోటుచేసుకొన్నది. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి జ్ఞానేశ్వరి రామన్ శనివారం (మార్చి 21) ఉదయం కన్నుమూశారు. దాంతో రత్నవేలు కుటుంబం విషాదానికి లోనైంది. మాతృవియోగంతో బాధపడుతున్న రత్నవేలుకు దక్షిణాది సినీ ప్రముఖులు వ్యక్తిగతంగాను, ఫోన్‌లో పరామర్శించారు.
గతంలో రంగస్థలం సినిమా రిలీజ్ సమయంలో జ్ఞానేశ్వరి రామన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తల్లి ఆరోగ్యం క్షీణించిందనే వార్త అందడంతో రంగస్థలం ప్రమోషన్ కార్యక్రమాలు బీజీగా జరుగుతున్న సమయంలో హుటాహుటిన చెన్నైకి వెళ్లిపోయారు. రంగస్థలం సినిమా ప్రమోషన్స్ దూరంగా ఉన్నారు. తల్లి అరోగ్యం కుదుటపడిన తర్వాత ఆయన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కొద్దిరోజులుగా ఆరోగ్యంతో ఉన్న తల్లి జ్ఞానేశ్వరి రామన్ అకస్మాత్తుగా ఇటీవల మళ్లీ అనారోగ్యానికి గురవ్వడంతో ఆమెను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ జ్ఞానేశ్వరి రామన్ శనివారం ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
తల్లి మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న రత్నవేలును సుకుమార్, రాంచరణ్, మెగా ఫ్యామిలీ, ఇతర సినిమా ప్రముఖులు పరామర్శించారు. జ్ఞానేశ్వరి రామన్ అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











