హీరో ఒక్కడే.. హీరోయిన్లు 10 మంది.. డైరెక్టర్ స్కెచ్ భలే ఉందే!
ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్‌లు తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఈ సారి ఓ వెరైటీ కోణంలో సినిమా రూపొందించేందుకు రెడీ అయ్యాడు. 'ఢమరుకం' లాంటి ఫాంటసీ డ్రామా, 'శివమ్' లాంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించిన ఆయన ఇటీవలే రాగల 24 గంటల్లో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకున్నారు.
ఈషారెబ్బా, శ్రీరామ్, సత్యదేవ్ ప్రధాన తారాగణంగా గత శుక్రవారం వచ్చిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కింది. ఇటీవలి కాలంలో థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్న కారణంగా ఈ సినిమాకు శ్రీకారం చుట్టిన శ్రీనివాస్ రెడ్డి.. మరో డిఫరెంట్ సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు.

దీనికి భార్యదేవోభవ అనే పేరు కన్ఫర్మ్ చేసేశాడు ఈ డైరెక్టర్. ఈ సినిమాలో ఓ పాపులర్ హీరో నటించబోతున్నాడట. ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సిన మరో విషయమేమంటే ఇందులో 10 మంది హీరోయిన్స్ నటించబోతున్నారట.
రాగల 24 గంటల్లో సినిమా నిర్మాత శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. వచ్చే నెల నుండి సినిమా ప్రారంభం కానుందని సమాచారం. చూడాలి మరి ఈ ఈ భార్యదేవోభవ అనే టైటిల్ సినిమాతో శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి మ్యాజిక్స్ చేస్తాడో!


Click it and Unblock the Notifications











