రెండో బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ భార్య.. ఆడ బిడ్డా? మగ బిడ్డా? అంటే?

కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా వెలుగొందుతున్నారు దర్శకుడు అట్లీ- ప్రియ దంపతులు. తమ బంధంపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ వీరిద్దరూ వాటికి చెక్ పెడుతూ వస్తున్నారు. ఇప్పటికే ఈ దంపతులకు ఓ కుమారుడు ఉండగా.. ఇటీవల ప్రియ రెండోసారి గర్భం దాల్చినట్లు ఇద్దరూ గుడ్‌న్యూస్ చెప్పారు. తాజాగా అక్షయ తృతీయ పర్వదినం నాడు అట్లీ- ప్రియ దంపతులు శుభవార్త చెప్పారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
'విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌కి రెడీ.. నా తర్వాతే రష్మిక’
'విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌కి రెడీ.. నా తర్వాతే రష్మిక’

అట్లీ అసలు పేరు అరుణ్ కుమార్. కోలీవుడ్‌ దర్శక దిగ్గజాలు మణిరత్నం, శంకర్, గౌతమ్ మీనన్ వద్ద అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించారు. 2013లో రాజా రాణి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అట్లీ.. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు. ఆ తర్వాత దళపతి విజయ్‌తో థేరీతో మరో విజయాన్ని సాధించారు. అనంతరం దళపతితోనే మెర్సెల్, బిగిల్ సినిమాలు తీసి వరుసగా హిట్స్ అందుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. అది కూడా ఏకంగా కింగ్ ఖాన్ నుంచి .. షారుఖ్ ఖాన్‌తో జవాన్ చిత్రాన్ని తెరకెక్కించారు.

Raaka Director Atlee And Wife Priya Welcome Baby Girl

ఈ సినిమా దాదాపు 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించడంతో పాటు సౌత్ సినిమాల దెబ్బకి కుదేలైన బాలీవుడ్‌కి కొత్త ఊపిరిలూదింది. తద్వారా 1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తమిళ దర్శకుడిగా చరిత్ర సృష్టించారు అట్లీ. ప్రస్తుతం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాకా సినిమాను తెరకెక్కిస్తున్నారు అట్లీ. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీని సైన్స్ ఫిక్సన్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్నారు.

Recommended For You
సూపర్‌స్టార్ కొడుకుని 6 ఏళ్లు వెంటాడిన హీరోయిన్... బిడ్డని అలా కాపాడుకున్న నటుడు
సూపర్‌స్టార్ కొడుకుని 6 ఏళ్లు వెంటాడిన హీరోయిన్... బిడ్డని అలా కాపాడుకున్న నటుడు

ఇక అట్లీ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ప్రియతో ప్రేమలో పడిన ఆయన దాదాపు 8 ఏళ్ల పాటు డేటింగ్ చేశారు. అనంతరం నవంబర్ 9, 2014న ప్రియను వివాహం చేసుకున్నారు. పెళ్లయిన దాదాపు 9 ఏళ్ల తర్వాత ఈ దంపతులు శుభవార్త చెప్పారు. 2023లో వీరికి కుమారుడు మీర్ జన్మించాడు. భార్యా, కుమారుడితో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అట్లీ. కుమారుడు పుట్టిన మూడేళ్లకు మరోసారి అట్లీ- ప్రియ దంపతులు గుడ్‌న్యూస్ చెప్పారు.

You May Also Like
'విడాకుల్లో నా తప్పేమి లేదు.. చైతూతో పెళ్ళికి 100 శాతం న్యాయం చేశా’
'విడాకుల్లో నా తప్పేమి లేదు.. చైతూతో పెళ్ళికి 100 శాతం న్యాయం చేశా’

ఓ నోట్ ద్వారా ప్రియ మరోసారి గర్భం దాల్చినట్లు పంచుకున్నారు. మా ఇల్లు ఇప్పుడు మరింత ప్రేమతో నిండిపోతుంది. మేమిద్దరం మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నాం. మీ ఆశీస్సులు, ప్రేమ, ప్రార్ధనలు కావాలని ప్రియ కోరారు. ఈ నోట్‌తో పాటు భర్త అట్లీ, కుమారుడు మీర్‌తో పాటు పెంపుడు జంతువులతో దిగిన ఫోటోలను ప్రియ షేర్ చేశారు.

'ఆ క్షణంలో అలా లొంగిపోయా.. అన్నీ కోల్పోయాకే విలువ తెలిసేది’
'ఆ క్షణంలో అలా లొంగిపోయా.. అన్నీ కోల్పోయాకే విలువ తెలిసేది’

ఈ క్రమంలో సోమవారం పండంటి ఆడబడ్డకు జన్మనిచ్చారు ప్రియ. ఈ విషయాన్ని అట్లీ, ప్రియ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అది చాలా డిఫరెంట్‌గా ప్రకటించి తమ క్రియేటివిటీని చూపించారు. బిగ్ బ్రదర్ మీర్‌కు చెల్లెలు వచ్చిందని ప్రత్యేకంగా ఒక కలర్‌ఫుల్ పోస్టర్ విడుదల చేశారు. దాంతో అక్షయ తృతీయ పర్వదినం నాడు మీ ఇంటికి పండంటి ఆడబిడ్డ వచ్చిందని అభిమానులు, సినీ ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. హీరోయిన్లు కాజల్ అగర్వాల్, సమంత, రష్మిక మందన్న, అనన్య పాండే, నిషా అగర్వాల్ తదితరులు అట్లీ దంపతులకు విషెస్ తెలియజేశారు

Read more about: Raaka atlee priya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X