Raaka Movie: మెంటలెక్కిస్తున్న అల్లు అర్జున్ న్యూ లుక్.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..

RAAKA First Look: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా పై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బన్నీ కొత్త సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించబడింది. దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు 'రాకా (RAAKA)' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ టైటిల్ పోస్టర్ విడుదలైన కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బన్నీ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

విడుదలైన టైటిల్ పోస్టర్ డార్క్ అండ్ ఇంటెన్స్ కలర్ టోన్‌తో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో హీరో లుక్‌ను పూర్తి స్థాయిలో రివీల్ చేయకపోయినా, బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే ఎలిమెంట్స్ ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందనే క్లారిటీ వస్తోంది. "రాకా" అనే టైటిల్ కూడా ఒక మాస్ వైబ్‌ను క్రియేట్ చేస్తూ, సినిమాలో ఉన్న రగ్డ్ ఎమోషన్‌ను సూచిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత ఆసక్తికర అంశం- అల్లు అర్జున్ లుక్. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. బన్నీ సగం మనిషి - సగం తోడేలు (వోల్ఫ్) తరహా గెటప్‌లో చూపించబోతున్నారట. ఇది కేవలం మేకోవర్ మాత్రమే కాకుండా, కథలోనే కీలకమైన ఎలిమెంట్‌గా ఉండబోతుందని చూపిస్తుంది. ఈ కాన్సెప్ట్ ద్వారా దర్శకుడు అట్లీ కుమార్ మరోసారి కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడనే టాక్ వినిపిస్తోంది.

RAAKA First Look Allu Arjun s Beast Avatar in Atlee s Sci-Fi Stuns Fans
ఈ సినిమా పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుండగా, కథలో 50% మైథలాజీ, 50% ఆధునిక ప్రపంచం మేళవింపుగా ఉండబోతుందని సమాచారం. విభిన్న జీవులు, రాక్షసుల తరహా పాత్రలు, విజువల్ ఎఫెక్ట్స్ ఆధారిత యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాలో హైలైట్ కానున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ వీడియో, గ్లింప్స్ ఈ సినిమా హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రూపొందించబడిన హైప్‌ను మరింత పెంచింది.

ఈ భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అలాగే మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ చిత్రంలో కానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఈ సినిమాలో అవకాశం ఉందని టాక్, అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, అల్లు అర్జున్ దాదాపు రూ.170 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా, దర్శకుడు అట్లీ కుమార్ రూ.100 కోట్ల వరకు తీసుకుంటున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ - ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నాడనే టాక్. ఇది నిజమైతే, ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద ప్రయోగాత్మక చిత్రం అవుతుంది. ఇప్పటికే పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్ వంటి చిత్రాలతో తన మార్క్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన బన్నీ, ఇప్పుడు "రాకా"తో మరో లెవెల్‌కు వెళ్లబోతున్నాడని అభిమానులు నమ్ముతున్నారు.

మొత్తంగా "రాకా" ప్రతి అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, రిలీజ్‌కు ముందే భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. అట్లీ మాస్ మేకింగ్, బన్నీ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, భారీ విజువల్స్-అన్నీ కలిసి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించేలా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే తదుపరి అప్‌డేట్స్ కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. "రాకా" నిజంగానే ఇండియన్ సినిమా రేంజ్‌ను పెంచే విజువల్ వండర్ అవుతుందా? అన్నది చూడాలి.

Read more about: allu arjun atlee AA22xA6
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X