Raaka: రాకాగా అల్లు అర్జున్... అట్లీ- ఐకాన్‌స్టార్ మూవీ టైటిల్‌పై నిహారిక ఫస్ట్ రియాక్షన్

పుష్ప సిరీస్ తర్వాత ఐకాన్‌స్టార్‌గా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించారు అల్లు అర్జున్. దాంతో ఆయన తదుపరి సినిమాపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్టీ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు బన్నీ. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ చిత్రం. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తుండటం ఇంకా హైప్ పెంచేసింది. ఇక ఈ సినిమా ప్రిపరేషన్ వర్క్స్‌కు సంబంధించిన బయటికొచ్చిన ఫోటోలు, వీడియోలు ఆ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లాయి.

ఇప్పటి వరకు AA 22X A 6 వర్కింగ్ టైటిల్‌తోనే షూటింగ్ జరుగుతున్న ఈ భారీ చిత్రం టైటిల్ ఏంటీ? అల్లు అర్జున్ ఎలాంటి లుక్‌లో కనిపించబోతున్నాడు? అంటూ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అలాగే సినిమా నుంచి ఏ విధమైన అప్‌డేట్స్ లేకపోవడంతో అల్లు ఆర్మీ మంచి ఆకలి మీదున్నారు. ఈ సస్పెన్స్‌కి తెరదించుతూ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏప్రిల్ 8వ తేదీన ఈ మూవీ టైటిల్, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసింది చిత్ర యూనిట్. అదే రాకా..

Raaka Niharika Konidela Reacts to Allu Arjun Atlee Title Buzz Calls It a Coincidence

గుండుతో.. కత్తుల్లాంటి గోళ్లతో వైల్డ్‌గా కనిపిస్తున్న అల్లు అర్జున్ భయపెడుతున్నాడు. మీ ఊహాలకు మించి ఈ సినిమా ఉంటుందని, మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అంటూ చిత్రయూనిట్ క్యాప్షన్ పెట్టడంతో రాకాపై అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ సహా ఏడు భాషలలో రాకాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాకాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. రష్మిక మందన్న, జాన్వీ కపూర్‌, మృణాల్ ఠాకూర్ కూడా కీలకపాత్రలు పోషించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు రమ్యకృష్ణ, జిమ్ సర్బ్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సాయి అభయాంకర్ సంగీతం, ఆంటోనీ ఎల్ రూబిన్ ఎడిటింగ్, జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అల్లు అర్జున్ - అట్లీ మూవీకి రాకా టైటిల్‌పై అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా దీనిపై మెగా డాటర్ నిహారిక కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించగా.. మానస శర్మ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 3న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నది. ఈ సందర్భంగా నిహారిక కొణిదెలను రాకాస టైటిల్ గురించి ప్రశ్నించారు. మీరు అల్లు అర్జున్ గారు ఏమైనా మాట్లాడుకున్నారా? రాకాస.. రాకా ఈ టైటిల్స్ ఏంటీ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి నిహారిక స్పందిస్తూ.. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. దీని గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు, అట్లీ- బన్నీ ప్రాజెక్ట్ వివరాలు టాప్ సీక్రెట్. మీరెంత సర్‌ప్రైజ్ అయ్యారో తెలియదు కానీ, మేమైతే షాక్ అయ్యామని నిహారిక తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X