Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘పక్కా కమర్షియల్’ కోసం ఇద్దరు భామలు: తెలుగు హీరోయిన్‌కు కీలక పాత్ర
కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను అందుకుని.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు టాలెంటెడ్ స్టార్ గోపీచంద్. అయితే, చాలా కాలంగా అతడు సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయినప్పటికీ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతితో జత కట్టాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కలిసి 'పక్కా కమర్షియల్' అనే మూవీ చేస్తున్నారు.
ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే మారుతితో గోపీచంద్ చేస్తున్న చిత్రమే 'పక్కా కమర్షియల్'. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మార్చి 5 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే, దీన్ని అక్టోబర్ 1న రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాడట మారుతి.
ఇందులో భాగంగానే ఇందులో నటించే హీరోయిన్ విషయంలో క్లారిటీకి వచ్చేశాడని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ 'పక్కా కమర్షియల్' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారట. అందులో ఒకరు గ్లామరస్ క్వీన్ రాశీ ఖన్నా కాగా.. మరొకరు తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా అని తెలుస్తోంది. ఈ ఇద్దరికి సమానమైన ప్రాధాన్యం ఇస్తూ స్క్రిప్ట్ రెడీ చేశాడట మారుతి. అయితే, ఈషా క్యారెక్టర్ మాత్రం గతంలో ఎన్నడూ చూడని విధంగా డిజైన్ చేశాడని అంటున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.