అదిరిపోయే కాన్సెప్ట్.. ఆ పాత్రలో రాశీ ఖన్నా అదిరిపోతుందట.. మారుతి ఐడియా హైలెట్

యూత్‌కు కనెక్ట్ అయ్యేలా చిత్రాలను తెరకెక్కించడంలో ఎవరైనా దర్శకుడు మారుతి తరువాతే. ఈరోజుల్లో, బస్టాప్ లాంటి సినిమాలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. అప్పట్లో ఆ చిత్రాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే గతకొంత కాలం నుంచి ఒకే ఫార్మాట్‌లో చిత్రాలను తెరకెక్కించడంతో కాస్త వెనుకబడ్డాడు. ఒకే రకమైన మూవీలను అందిస్తూ వస్తోన్న మారుతి రూట్ మార్చి కాస్త కొత్తగా ట్రై చేస్తున్నాడు.

సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిరోజూ పండగే చిత్రాన్ని మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడు. అంతేకాకుండా పొట్ట చెక్కలయ్యేల్లాంటి కామెడీ ట్రాక్‌ను కూడా నడిపించబోతోన్నట్లు టాక్. ఈ చిత్రంలో టిక్ టాక్‌కు బానిసైన పాత్రలో రాశీ ఖన్నా నటించబోతోన్నట్లు సమాచారం. ప్రస్తుతం టిక్ టాక్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీని వల్ల ఎన్నో కాపురాలు కూలిపోతుండటం, నేరాలు కూడా పెరగడం, సెల్‌ఫోన్లకు బానిసవ్వడం ఇలా ప్రతీ రోజూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.

 Raashi Khanna Playing TikTok Addictive Character In Prathi Roju Pandage

అలాంటి టిక్ టాక్‌ను బేస్ చేసుకుని రాసుకున్న పాత్రలో రాశీ ఖన్నా విపరీతంగా హాస్యాన్ని పండించబోతోన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే థియేటర్లలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. టిక్ టాక్ వీడియోలు ఎంత ఫన్నీగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎంతో మంది తమ టాలెంట్‌ను బయట పెడుతున్నారు. మరి ఇలాంటి పాత్రలో రాశీ అందర్నీ కడుపుబ్బా నవ్వించబోతోందని తెలుస్తోంది. డిసెంబర్ 20న రాబోతోన్న ఈ చిత్రానికి టిక్ టాక్ ఎపిసోడ్స్ ఎంత వరకు హెల్ప్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X