విజయ్ దేవరకొండ కొత్త చిత్రం.. క్రేజీ హీరోయిన్ ఖరారు!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం గీత గోవిందం ఆగష్టు 15 న విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. మరో చిత్రానికి కూడా విజయ్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. తాజగా ఈ చిత్రానికి హీరోయిన్ కూడా ఖరారైంది. విజయ్ దేవరకొండ సరసన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా నటించబోతోంది.

ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుందట. ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని మాధవ్ రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందోఅదే స్థాయిలో రాశి ఖన్నా పాత్ర ఉంటుందని అంటున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











