తేజ ఆఫీస్‌కి వెళ్ళా.. చేయక తప్పలేదు.. ఫోన్‌లో నాగబాబు కూడా: రాశి ఓపెన్ కామెంట్స్

బాలనటిగా వెండితెర గడపతొక్కిన రాశి ఎన్నో సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. వెండితెర అందాలకు చిరునామా అన్నట్లుగా సాగిన రాశి సినీ ప్రయాణం టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తన కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈమె తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొని.. సినీ కెరీర్‌లోని కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ తేజ, నాగబాబు ప్రస్తావన తీసుకొచ్చింది. ఆ వివరాలు చూద్దామా..

దర్శకుడు తేజ ఒప్పించాడు.. తీరా చూస్తే

దర్శకుడు తేజ ఒప్పించాడు.. తీరా చూస్తే

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిజం' సినిమాలో నటించింది రాశి. అయితే ఈ సినిమాలో తన పాత్ర విషయమై దర్శకుడు తేజ తప్పుగా చెప్పి ఒప్పించాడని పేర్కొంది. తీరా సినిమా సెట్స్ పైకి వచ్చాక తన పాత్రను పూర్తిగా మార్చేసి నెగిటివ్‌గా చూపించారని రాశి పేర్కొంది. ఆ సందర్భంలో తాను ఎలా రియాక్ట్ అయ్యాననే విషయాన్ని రాశి బయటపెట్టింది.

ఎవ్వరి ఆఫీస్‌లకు వెళ్లని నేను తేజ దగ్గరకు వెళితే..

ఎవ్వరి ఆఫీస్‌లకు వెళ్లని నేను తేజ దగ్గరకు వెళితే..

సాధారణంగా తాను ఎవ్వరి ఆఫీస్‌లకు వెళ్లేదాన్ని కాదని, కానీ 'నిజం' సమయంలో తేజ పిలిచారని ఆయన ఆఫీస్ వెళ్లానని చెప్పింది రాశి. ఆ సమయంలో మహేష్ బాబు హీరో అని చెప్పిన తేజ.. చిత్రంలో గోపీచంద్, నువ్వు లవర్స్ అని, సినిమా అంతా మీ కథ చుట్టూనే తిరుగుతుందని చెప్పారని తెలిపింది. దాంతో తాను వెంటనే ఒప్పుకున్నానని చెప్పింది.

అప్పుడు తెలిసింది అసలు మ్యాటర్

అప్పుడు తెలిసింది అసలు మ్యాటర్

తీరా 'నిజం' సెట్స్ పైకి వచ్చాక అసలు మ్యాటర్ అర్థమైందని రాశి చెప్పుకొచ్చింది. ఫస్ట్ సీన్ లోనే విషయం తెలిసిందని, దాంతో ఆ సినిమా నుంచి తప్పుకుందామని అనుకున్నానని రాశి చెప్పింది. చివరకు మా పీఆర్వో సలహా మేరకు ఆ సినిమాలో నటించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది.

ఫోన్‌లో నాగబాబు ఏమన్నారంటే

ఫోన్‌లో నాగబాబు ఏమన్నారంటే

ఇక ఆ పాత్ర చేశాక అందరి నుంచి మిశ్రమ స్పందన లభించిందని రాశి తెలిపింది. కొందరు బాగుందని చెబితే.. ఇంకొందరు మాత్రం ఆ క్యారెక్టర్ ఎందుకు చేశావని అడిగారని తెలిపింది రాశి. ఇక మెగా బ్రదర్ నాగబాబు ఫోన్ చేసి 'నీ పాత్ర నెగెటివ్ అయినా నువ్వు కత్తిలా ఉన్నావ్' అన్నారని రాశి చెప్పింది.

Recommended Video

Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
రాశి సినిమాలు.. ప్రస్తుత పరిస్థితి

రాశి సినిమాలు.. ప్రస్తుత పరిస్థితి

తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ సత్తా చాటుతూ సౌత్ ఇండియన్ క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రాశి.. గత కొంతకాలంగా తన సినిమాల ప్రవాహాన్ని తగ్గించేసింది. అడపాదడపా సినిమాల్లో నటించినప్పటికీ సినిమాల పరంగా ప్రస్తుతం ఆమె ప్రభావం ఏ మాత్రం కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X