పవన్ కోసం వెళ్ళాను.. అపాయింట్‌మెంట్ కష్టమే అనుకుంటే ఇదీ జరిగింది: రాశి
బాల నటిగా కెరీర్ ప్రారంభించి.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది అందాల తార రాశి. వెండితెర అందాలకు చిరునామా అంటే రాశి అన్నట్లుగా క్రేజ్ కొట్టేసింది ఈ అచ్చ తెలుగు హీరోయిన్. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఈమె తాజాగా 'ఆలీతో సరదాగా' టీవీ కార్యక్రమంలో పాల్గొని తన సినీ కెరీర్ విషయాలను, జీవితంలోని కీలక సంఘటనలను పంచుకుంది.
ఈ కార్యక్రమంలో తనకు పవన్ కళ్యాణ్‌తో కలిసి గోకులంలో సీత సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చిందో చెప్పిన రాశి.. ఆయన వ్యక్తిత్వం గురించి కూడా మాట్లాడింది. నాలుగేళ్ల క్రితం మా పాప మొదటి పుట్టిన రోజుకి పవన్ కళ్యాణ్‌ని ఆహ్వానించేందుకు వెళ్లగా జరిగిన సంఘటన వివరించింది రాశి.

తాను వెళ్లిన సమయంలో పవన్ తన సినిమా షూటింగులో బిజీగా ఉన్నారని, తెలిసిన మనిషే కదా అని నేరుగా కార్లోనే ఆయన లొకేషన్‌కి వెళ్లానని చెప్పింది రాశి. షూటింగ్ వాతావరణం అంతా జనంతో కోలాహలంగా ఉందని, అది చూసి పవన్ అపాయింట్‌మెంట్ కష్టమే అని మా డ్రైవర్ అన్నాడని రాశి చెప్పింది. అయితే అదే డ్రైవర్‌తో పవన్‌కి కబురు పెట్టగా.. ఆయన రియాక్ట్ అయిన తీరు ఆశ్చర్యపర్చిందని ఆమె తెలిపింది.
'అయ్యో కబురు చేయడమేంటి రమ్మని చెప్పు' అని పవన్ మా డ్రైవర్‌తో అన్నారని రాశి చెప్పింది. ఆ వెంటనే తాను వెళ్లి పవన్‌ని కలిస్తే ఎంతో ఆప్యాయంగా పలకరించి చాలాసేపు మాట్లాడారని ఆమె చెప్పుకొచ్చింది. సో.. పవన్ క్రేజ్ పెరిగిందే తప్ప ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని అప్పుడు తనకు క్లియర్‌గా అర్థమైందని రాశి చెప్పింది.


Click it and Unblock the Notifications