సురేఖ ఇంటికి పిలిచింది.. రంగమ్మత్త క్యారెక్టర్ అందుకే వదిలేశా.. సీక్రెట్స్ రివీల్ చేసిన రాశీ

ఒక్కపుడు వెండితెర అందాలకు చిరునామాగా రాశీ ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ రాశీ. గోకులంలో సీత, ప్రేయసీ రావే, సుప్రభాతం లాంటి ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె.. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొని తన సినీ కెరీర్ లోని కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది. ఆ వివరాలేంటో చూద్దామా..

గోకులంలో సీత టైమ్‌లో కొణిదెల సురేఖ

గోకులంలో సీత టైమ్‌లో కొణిదెల సురేఖ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గోకులంలో సీత సినిమాలో నటించిన రాశీ.. సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సీతగా తన అభినయంతో మెగా అభిమానులను కట్టిపడేసింది. అయితే ఆ క్యారెక్టర్ ఎలా వచ్చిందనే విషయమై స్పందించిన రాశీ.. పవన్ పక్కన సీత క్యారెక్టర్‌లో తాను మాత్రమే సూట్ అవుతానని కొణిదెల సురేఖ రిఫరెన్స్ ఇచ్చిందని తెలిపింది రాశీ.

మెగాస్టార్ సతీమణి వాళ్ళింటికి పిలిపించుకొని మరీ..

మెగాస్టార్ సతీమణి వాళ్ళింటికి పిలిపించుకొని మరీ..

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ వాళ్ళింటికి పిలిపించుకొని మరీ గోకులంలో సీత సినిమాలో తనను పెట్టుకోండని చెప్పినట్లుగా రాశీ పేర్కొంది. తమకు 'గోకులంలో సీత' టీమ్ నుంచి పిలుపు రాగానే ఆల్బమ్ తీసుకొని వాళ్ళింటికి వెళ్లామని చెప్పింది. చిరంజీవి గారు పిలిచారని తాము అనుకున్నామని, కానీ అక్కడికెళ్ళాక తెలిసింది ఏంటనే.. నన్ను పిలిచింది సురేఖ గారని చెప్పింది రాశీ. అప్పుడే సీతగా తాను బాగుంటానని సురేఖ చెప్పిందని రాశీ తెలిపింది.

రంగస్థలంలో రంగమ్మత్త.. సీక్రెట్ చెప్పిన రాశీ

రంగస్థలంలో రంగమ్మత్త.. సీక్రెట్ చెప్పిన రాశీ

ఇక రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ 'రంగస్థలం'లో తనకు రంగమత్త క్యారెక్టర్ వచ్చిన మాట వాస్తవమేనని రాశీ పేర్కొంది. అయితే ఇంత మంచి క్యారెక్టర్ వదులుకోవడం వెనుక బలమైన కారణం కూడా ఉందని తెలుపుతూ ఆ సీక్రెట్ వెల్లడించింది రాశీ.

అలా చేయడం నా వల్ల కాదని చెప్పేశా..

అలా చేయడం నా వల్ల కాదని చెప్పేశా..

రంగస్థలం సినిమాలో మొదట్లో రంగమత్త పిండి రుబ్బుతున్నపుడు తొడలు కనిపిస్తుంటాయి. అది నార్మలే అయినప్పటికీ అది తనకు సూట్ కాదని చెప్పేశానని రాశీ తెలిపింది. ఆ క్యారెక్టర్‌కి అది అవసరమే అయినప్పటికీ తన వల్ల కాదని రిజెక్ట్ చేశానని రాశీ చెప్పుకొచ్చింది.

రంగమత్తగా అనసూయ.. ముద్దుగా అందరూ అలాగే!

రంగమత్తగా అనసూయ.. ముద్దుగా అందరూ అలాగే!

రాశీ వదులుకున్న రంగమత్త క్యారెక్టర్ యాంకర్ అనసూయ చేత చేయించారు రంగస్థలం మేకర్స్. ఇక ఈ క్యారెక్టర్ అనసూయ కెరీర్‌కి ఎంత మేర ప్లస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం అనసూయను రంగమత్త అని ముద్దుగా పిలిచుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. అదీ రంగమ్మత్త రేంజ్. బట్ రాశీ అలా మిస్ అయిందన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X