యాంకర్ అనసూయ భరద్వాజ్ చేతుల మీదుగా రాధే బన్సీ

సోషల్ మీడియా, యూట్యూబ్‌ లాంటి ప్రసార సాధనాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది తన సృజనాత్మకతను చాటుకొని సినిమా పరిశ్రమలో టాప్ దర్శకులుగా, నటులుగా, టెక్నిషియన్స్‌గా నిలదొక్కుకొన్నారు. అలాంటి క్రియేటివిటి పుష్కలంగా ఉన్న ఓ యువ టీమ్ చేసి ప్రయత్నమే రాధే బన్సీ షార్ట్ ఫిలిం. ఈ లఘు చిత్రాన్ని ఇరా ఫిల్మ్స్ ఒరిజినల్స్ బ్యానర్‌పై సీతా మాచినేని నిర్మించారు. వినయ్ వివేక వర్ధన్ దర్శకత్వం వహించగా కీలక పాత్రల్లో శైలేష్ సన్నీ, రమ్య పసుపులేటి నటించారు.

ఇద్దరి ప్రేమికుల జీవితాల్లో జరిగిన బ్రేకప్ కథా నేపథ్యంగా రాధే బన్సీ రూపొందించారు. పెళ్లికి కొద్ది గంటల ముందు తన మాజీ ప్రేయసిని కలిసిన బన్సీ.. తన ప్రేమను ఎందుకు నిరాకరించావని ప్రశ్నిస్తారు. అందుకు రాధే చెప్పిన కొన్ని విషయాలు చాలా ఆసక్తిగా తెరపైన అనిపిస్తాయి. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఈ ఫిలింకు ప్రత్యేక ఆకర్షణ. నిడివి తక్కువగా ఉన్నప్పటికీ మంచి ఎమోషన్స్‌ కనిపించాయి. రమ్య, శైలేష్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది.

 Radhe Bansi released by anasuya bharadwaj

ఇలాంటి ఎమోషనల్ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన రాధే బన్సీని ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చేతుల మీద ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ షార్ట్ ఫిలిం విశేషంగా ఆదరణ చూరగొట్టున్నది. ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

 Radhe Bansi released by anasuya bharadwaj

నటీనటులు: శైలేష్ సన్నీ, రమ్య పసుపులేటి
దర్శకత్వం: వినయ్ వివేక వర్ధన్
రచన: రామ్ ఎర్ర, జయంత్ గుప్తా
నిర్మాత: సీతా మాచినేని
డీవోపీ: ఈశ్వర్ ఎల్లు మహంతి
మ్యూజిక్: వంశీ కృష్ణ కీస్
ఎడిటర్: కేసీబీ హరి
బ్యానర్: ఇరా ఫిల్మ్స్ ఒరిజినల్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ కాంచీ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X