Prabhas ఫ్యాన్స్ ఆవేశం.. ఇప్పటికి భయంతో రాధేశ్యామ్ దర్శకుడు అలా జాగ్రత్తగా
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న రాధే శ్యామ్ సినిమా ఏ స్థాయిలో నిరాశపరచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్గెస్ట్ పాన్ ఇండియా లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ భారీస్థాయిలో ప్రమోషన్ చేసింది. ముఖ్యంగా దర్శకుడు రాధాకృష్ణ అయితే సోషల్ మీడియాలో సినిమా విడుదల వరకు కూడా ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించేవారు.
అయితే ఇప్పుడు మాత్రం ఆయన అభిమానులు ఆవేశం కారణంగా ఎక్కువగా హడావిడి చేయకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన తీసుకున్న ఒక నిర్ణయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది పూర్తి వివరాల్లోకి వెళితే..

బాహుబలి తరువాత
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అంతకు మించి అనేలా సక్సెస్ అందుకోవాలి అని అభిమానులు ఎంతో ఆతృతగా చూసిన సమయంలో సాహో సినిమాతో ఊహించని విధంగా దెబ్బ పడింది. ఆ సినిమా కమర్షియల్ గా అయితే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. పూర్తిస్థాయిలో అభిమానులు కూడా సంతృప్తి చెందలేకపోయారు. ఒక విధంగా యూవీక్రియేషన్స్ లోపం కూడా చాలా ఉంది అని చెప్పాలి.

మరో పెద్ద షాక్
ఇక సాహో సినిమా తర్వాత అయినా సరే తప్పకుండా మరొక సినిమాతో సక్సెస్ అందుకుంటాడు అని అనుకుంటే ప్రభాస్ మరో పెద్ద షాక్ ఇచ్చాడు. జిల్ అనే ఒక సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్న డైరెక్టర్ రాధాకృష్ణతో చేసిన రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో స్పెషల్గా చెప్పనవసరం లేదు.

దర్శకుడిపై విమర్శలు
రాధే శ్యామ్ సినిమా ఓ వర్గం వారికి బాగానే ఆకట్టుకున్నప్పటికి కూడా కొందరు అయితే ఆ సినిమా చూసి ఏమాత్రం సంతృప్తి పొందలేకపోయారు. ముఖ్యంగా ఫైనల్ క్లైమాక్స్ సన్నివేశం లో ప్రభాస్ ను చూపించిన విధానంతో ఒక్కసారిగా దర్శకుడి పై విమర్శలు కూడా చేశారు. ఎందుకు అలా చేశారు అని చాలామంది ఇప్పటికి సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉన్నారు. అయితే దర్శకుడు మాత్రం ఎక్కువగా ఆ కామెంట్స్ ను పట్టించుకోకుండా పాజిటివ్ కామెంట్స్ పైమే స్పందిస్తూ వచ్చాడు.

అభిమానుల భయానికి..
ఇక ఆ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా దర్శకుడికి సోషల్ మీడియాలో అనేక రకాల నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇది వరకే అతను నెగిటివ్ కామెంట్స్ ను పట్టించుకోవద్దు అని సోషల్ మీడియాలో ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ తర్వాత అభిమానుల భయానికి తట్టుకోలేక చాలావరకు సోషల్ మీడియాకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు.

జాగ్రత్తలు తీసుకుంటున్న రాధాకృష్ణ
ఒకవేళ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసినా కూడా దానిపైన ఎవరు కామెంట్ చేయకుండా రాధాకృష్ణ ప్రైవసీ సెట్ చేసుకోవడం విశేషం. ఎవరు కామెంట్ చేయకుండా కామెంట్ బాక్స్ కు ప్రైవసీ సెట్టింగ్ చేసుకున్నారు. దీన్ని బట్టి దర్శకుడు అభిమానుల నుంచి నెగిటివ్ కామెంట్లు ఏ రేంజ్ లో అందుకుంటున్నాడో ఊహించవచ్చు అని మరికొందరు స్పందిస్తున్నారు. ఇక రాధే శ్యామ్ సినిమాతో ఊహించని దెబ్బ తిన్న ఈ దర్శకుడు మరి నెక్స్ట్ ఏ హీరోతో వర్క్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











