Radhe Shyam: ప్లాన్ మార్చిన ప్రభాస్.. ఫ్యాన్స్‌కు వరుస సర్‌ప్రైజ్‌లు
హీరోగా పరిచయం అయినప్పటి నుంచి తెలుగులో మాత్రమే సినిమాలు చేసి.. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపించాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇక, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అక్కడి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడని అతడు.. వరుస పెట్టి భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇలా ఇప్పటికే 'సాహో' వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించాడు. దీనితో ఉత్తరాదిలో తన మార్కెట్‌ను మరింతగా పెంచుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే 'రాధే శ్యామ్' అనే రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ మూవీని కూడా మొదలు పెట్టేశాడు.
'జిల్' మూవీతో ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'రాధే శ్యామ్'. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని కూడా చూపిస్తోంది. ఇక, ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా ఏళ్లే అవుతోంది. అయితే, మధ్యలో అనుకోని అవాంతరాల కారణాల వల్ల చాలా సార్లు షూటింగ్ వాయిదా పడింది. ఇక, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉండడంతో ప్రస్తుతం వాటిని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాధే శ్యామ్'ను సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ప్రారంభించి.. ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత చేరువ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు టీజర్, ట్రైలర్, పాటలను కూడా విడుదల చేశారు. అన్ని భాషల్లోనూ వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదలకు అంతా రెడీ అనుకున్న సమయంలోనే కరోనా ప్రభావం కారణంగా ఇది వాయిదా పడింది. దీంతో ప్రమోషన్ మళ్లీ మొదటికి వచ్చినట్లైంది.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'రాధే శ్యామ్' మూవీని మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. దీనికి సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను పున: ప్రారంభించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే మార్చి మొదటి వారం నుంచి ప్రమోషనల్ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇందులో భాగంగానే హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం సిటీల్లో స్పెషల్ ఈవెంట్లు నిర్వహించబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిసినట్లు తెలిసింది. ఈ ప్రకటన కూడా త్వరలోనే రానుందని అంటున్నారు.
'రాధే శ్యామ్' మూవీని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ వంటి వాళ్లు నటిస్తున్నారు. అలాగే, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలకు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక, హిందీ వెర్షన్ కోసం మిథూన్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్‌లు వర్క్ చేశారు.


Click it and Unblock the Notifications











