Radhe Shyam వెండితెరపై ప్రభాస్ డార్లింగ్ మాయ.. సాయిధరమ్ తేజ్, సినీ ప్రముఖుల ట్వీట్ల వర్షం
ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదలైంది. ఈ సందర్భంగా తెలుగు సినిమాకు సంబంధించిన హీరోలు సాయిధరమ్ తేజ్, మంచు మనోజ్ తదితరులు ట్వీట్ చేసి విషెస్ అందజేశారు. వెండితెరపై డార్లింగ్ మాయను చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఎవరెవరూ ట్వీట్ చేశారంటే..
సాయిధరమ్ తేజ్ ట్వీట్
రాధేశ్యామ్ సినిమాలో ప్రతీ కంటెంట్‌ను ఆస్వాదించాను. బిగ్ స్క్రీన్‌పై ఈ ప్రేమ కథా దృశ్యకావ్యాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రభాస్, వంశీ అన్న భారీ విజయాన్ని అందుకోవాలని ఎదురు చూస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విజయాల పరంపర కొనసాగించాలని కోరుకొంటున్నాను. పూజా హెగ్డే, రాధాకృష్ణ, యూవీ క్రియేషన్స్‌కు ఆల్ ది బెస్ట్ అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.
అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్.
రాధేశ్యామ్ సినిమా యూనిట్‌కు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు చూడని గ్రాండ్ లవ్ స్టోరి. ఆన్ స్క్రీన్‌పై ప్రభాస్ డార్లింగ్‌ను చూడటానికి ఎదురు చూస్తున్నాను. థియేటర్లలో రాధేశ్యామ్‌ను చూడటానికి వెళ్లండి అని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.
మెహర్ రమేష్ ట్వీట్
వెండితెరపై మ్యాగ్నమ్ ఓపస్ మూవీ రాధేశ్యామ్ విడుదలైంది. ఈ సినిమాను వెండితెరపై చూడటానికి ఎదురు చూస్తున్నాను. ప్రభాస్, పూజా హెగ్డే, వంశీకి నా అడ్వాన్స్ కంగ్రాంట్స్ అంటూ మెహెర్ రమేష్ ట్వీట్ చేశాడు.
గోపిచంద్ మలినేని ట్వీట్ విషెస్
ప్రభాస్ డార్లింగ్‌కు నా బెస్ట్ విషెస్. రాధేశ్యామ్ యూనిట్‌కు శుభాకాంక్షలు. వెండితెరపై భారీ ప్రేమ కథా చిత్రాన్ని చూడటానికి ఎదురు చూస్తున్నాం అని గోపిచంద్ మలినేని ట్వీట్ చేశారు.
డార్లింగ్ ప్రభాస్ మరో బ్లాక్‌బస్టర్
రాధేశ్యామ్ సినిమాతో డార్లింగ్ ప్రభాస్ మరో బ్లాక్‌బస్టర్ సినిమాను అందుకోవాలని కోరుకొంటున్నాను. వెండితెరపై అరుదైన ప్రేమ కథను తెరకెక్కించడానికి వారు పడిన శ్రమను, యూనిట్ పెట్టిన కష్టానికి ఫలితం అందబోతున్నది అని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చేసింది
బ్లాక్ బస్టర్ కంటే మించిన విజయం
ప్యాన్ ఇండియా కింగ్ ప్రభాస్ సార్.. పూజా హెగ్డే గారు.. డైరెక్ట ర్ రాధా బ్రదర్, వంశీ అన్నా, ప్రమోద్ గారు, వికీ అన్నా, యూవీ క్రియేషన్స్, రాధేశ్యామ్ టీమ్‌కు నా శుభాకాంక్షలు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కంటే మించిన విజయాన్ని సాధించాలని కోరుకొంటున్నాను అని వెంకీ కుడుముల ట్వీట్ చేశాడు.
రాధేశ్యామ్ గురించి డైరెక్టర్ బాబీ
రాధేశ్యామ్ గురించి డైరెక్టర్ బాబీ ట్వీట్ చేస్తూ..
రాధేశ్యామ్ గురించి అనిల్ రావిపూడి ట్వీట్
ప్రభాస్ గురించి, రాధేశ్యామ్ గురించి అనిల్ రావిపూడి ట్వీట్ చేస్తూ..
ప్రేమ కథా చిత్రంగా
రాధేశ్యామ్ గొప్ప ప్రేమ కథా చిత్రంగా రూపొందింది. సిల్వర్ స్క్రిన్‌పై చూడటానికి ఎదురు చూస్తున్నాను అని హను రాఘవపూడి ట్వీట్ చేశాడు. టీమ్‌కు శుభాకాంక్షలు అందజేశారు.
మళ్ళీ మళ్ళీ చూస్తాం
దర్శకుడు మారుతి ట్వీట్ చేస్తూ..కానీ డార్లింగ్ సినిమా అంటే మేము మళ్ళీ మళ్ళీ చూస్తాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











