అమెరికాలో రికార్డు స్థాయి స్క్రీన్లలో రాధేశ్యామ్.. ఇక రికార్డులు బద్దలవ్వాల్సిందే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాధేశ్యామ్ మార్చి 11 విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మునుపెన్నడూ లేని విధంగా అమెరికా వ్యాపంగా రిలీజ్ అవబోతున్నట్టు సమాచారం ఆ వివరాల్లోకి వెళితే

రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్

రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్

బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్. ఆ తర్వాత సాహో సినిమాతో అంచనాలను అందుకోలేక పోయారు. ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం ఇటు తెలుగు ఆడియన్స్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో మరో సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేశాయి. సౌత్, నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయించారు.

రాధేశ్యామ్

రాధేశ్యామ్

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైపోగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు దర్శక నిర్మాతలు. రాధేశ్యామ్ సినిమా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించారు కానీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమాను వాయిదా వేశారు. అలా మొత్తం మీద దాన్ని మార్చి 11న విడుదల చేయడానికి నిర్ణయించారు. ఆరోజున ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకి సినిమా విడుదల కాని విధంగా అత్యధిక థియేటర్లలో ప్రభాస్ సినిమా సందడి చేయబోతోంది.

3, 000కు పైగా స్క్రీన్లలో

3, 000కు పైగా స్క్రీన్లలో

ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెర పైకి తీసుకు వస్తున్నారని తెలుస్తోంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో ఉన్నారు అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏకంగా 10, 000 థియేటర్లలో రిలీజ్ కానుంది. అమెరికాలో మాత్రమే ఈ సినిమా 3, 000కు పైగా స్క్రీన్లలో రిలీజ్ కానుందని సమాచారం..

కేవలం అమెరికాలోనే

కేవలం అమెరికాలోనే

ఈ సినిమా కేవలం అమెరికాలోనే 1116కి పైగా లొకేషన్లలో, 3116కి పైగా స్క్రీన్ లలో , 11116కి పైగా షోలు వేయనున్నారు. రాధేశ్యామ్ అత్యధిక స్థానాల్లో హిందీ 1116+ స్థానాలు, తెలుగు - 1116+ స్థానాలు, తమిళం 200+ స్థానాలు USAలోనే విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదనే చెప్పాలి. రాధేశ్యామ్ రిజల్ట్ పై ఉండే నమ్మకం వల్లే మేకర్స్ ఈ స్థాయిలో థియేటర్లలో సినిమాను ఆ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు ఏ తెలుగు హీరో సినిమా రిలీజ్ కాని స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుందని చెప్పక తప్పదు.

లవ్ స్టోరీ

లవ్ స్టోరీ

పిరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించియిది. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందించారు. రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో రూపొందుతున్న ఈ 'రాధే శ్యామ్' సినిమాని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి ప్రేమకథగా ఈ సినిమా స్టోరీ గురించి ప్రచారం జరుగుతోంది.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X