ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. రాధే శ్యామ్ యూనిట్ నుంచి బంపర్ గిఫ్ట్
ఏడాది దాటినా సినిమా విడుదల కాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్న తన అభిమానులకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శుభవార్తను అందించనున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. త్వరలోనే విడుదల కానున్న ప్రభాస్ తదుపరి చిత్రం రాధే శ్యామ్ చిత్రం టీజర్‌ను తన బర్త్ డే రోజున రిలీజ్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకొన్నట్టు సమాచారం. ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23 కావడంతో అదే రోజున టీజర్‌ను రిలీజ్ చేయాలనే ప్రయత్నంలో యూనిట్ ఉన్నట్టు సమాచారం.
రాధే శ్యామ్ సినిమా యూనిట్ ప్రణాళిక అనుకొన్నట్టు జరిగితే ఇప్పటికే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడం, ఆ సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో రిలీజ్ డేట్ వాయిదా పడింది. సెప్టెంబర్‌లో ఇటలీకి వెళ్లి సినిమాను పూర్తి చేద్దామనే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టు సమాచారం.

తాజా వార్తల ప్రకారం.. పూజా హెగ్గే ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ రాధే శ్యామ్ సినిమా సినిమా తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఆదిపురుష్ కాకుండా ప్రభాస్.. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం 2021లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అలాగే ప్రశాంత్ నీల్‌తో మరో ప్యాన్ ఇండియా మూవీ కోసం జతకడుతున్నట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.


Click it and Unblock the Notifications











