Radhe shyam Event: అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన నవీన్ పొలిశెట్టి.. అందుకే హోస్ట్ చేయడానికి వచ్చా అంటూ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ ఈవెంట్ ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామోజీ ఫిలిం సిటీ లో నిర్వహించిన ఈ వేడుకలకు అగ్ర దర్శకులు నిర్మాతలు కూడా హాజరయ్యారు. ప్రభాస్ తో చేయబోయే దర్శకులు కూడా హాజరయ్యారు. అయితే అందరి కంటే స్పెషల్ అట్రాక్షన్ గా యువహీరో నవీన్ పోలిశెట్టి హోస్టింగ్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక అతనికి పోటీగా మరో హాట్ యాంకర్ రష్మీ కూడా వచ్చింది. నవీన్ పోలిశెట్టి మాత్రం ఎప్పటిలానే తన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.

 విజిల్స్ వేసేలా ఎంట్రీ ఇచ్చిన నవీన్

విజిల్స్ వేసేలా ఎంట్రీ ఇచ్చిన నవీన్

నవీన్ పోలిశెట్టి ఎంట్రీ ఇవ్వగానే అందరూ అభిమానులు కూడా ఒక్కసారిగా గట్టిగా విజిల్స్ వేశారు. జాతిరత్నాలు పాటతో నవీన్ పోలిశెట్టి ఒక స్టార్ మీద ఎంట్రీ ఇచ్చాడు. గతంలో జాతిరత్నాలు సినిమా రిలీజ్ ఈవెంట్ లో ఎలాగైతే తన మాటలతో ఆకట్టుకున్నాడో ఈసారి కూడా అంతకుమించి అనేలా నవీన్ ఈ సారి అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడుతూ సరదాగా కనిపించాడు. అంతే కాకుండా అభిమానులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు

అభిమానులను కూల్ చేసిన నవీన్

అభిమానులను కూల్ చేసిన నవీన్

ఇక నవీన్ పోలిశెట్టి కంటే ముందే జబర్దస్త్ యాంకర్ రష్మీ కూడా ఈ వేడుకలో హోస్ట్ గా ప్రోగ్రాం మొదలుపెట్టింది. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వేడుకకు దాదాపు 80 వేల మందికి పైగా అభిమానులు హాజరైనట్లు సమాచారం. భారీ బందోబస్తు నిర్వహించిన పోలీసులకు అభిమానులను కంట్రోల్ చేయడం కూడా కష్టంగా మారింది. అయితే కొందరు అభిమానులు మధ్యలో అత్యుత్సాహం ప్రదర్శించడంతో నవీన్ పోలిశెట్టి వాళ్ళకి సున్నితంగానే సమాధానమిచ్చి కూల్ అయ్యేలా చేశాడు.

అందుకే వచ్చాను అంటూ..

అందుకే వచ్చాను అంటూ..

అయితే ఈ వేడుకకు ఎందుకు వచ్చాను అనే విషయంపై కూడా నవీన్ పోలిశెట్టి వివరణ ఇచ్చాడు. జాతి రత్నాలు సినిమా ప్రమోషన్లో మాకు అడగగానే సహాయం చేసిన ప్రభాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ ఈ వేడుకకు నేను హోస్ట్ గా రావడానికి ముఖ్య కారణం అదే అని తెలియజేశాడు. జాతి రత్నాలు సినిమాకు ప్రభాస్ మాటలు సపోర్ట్ చేసిన విధానం అంతా ఇంతా కాదని మళ్ళీ చాలాకాలం తర్వాత మిమ్మల్ని కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని నవీన్ వివరణ ఇచ్చాడు.

ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగానే..

ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగానే..

ఇక ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో నవీన్ పోలిశెట్టి అభిమానులతోపాటు గట్టిగా విజిల్స్ వేసి అలరించాడు. ఇక డార్లింగ్ ఎంట్రీ ఇచ్చే సమయంలో కూడా ఆయనతో మాట్లాడించారు. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ అలాగే సందీప్ రెడ్డి వంగ తో కూడా నవీన్ డాన్స్ చేయించే ప్రయత్నం చేశాడు. అభిమానుల మధ్యలోకి వెళ్లి కూడా నవీన్ డాన్స్ చేశాడు.

పాన్ ఇండియా వెల్కమ్..

పాన్ ఇండియా వెల్కమ్..

మొత్తంగా ఈ వేడుకలో నవీన్ పోలిశెట్టి అందరికంటే హైలెట్ గా నిలిచే తన మాటలతో అభిమానులను ఎంతగానో అలరించాడు. అంతేకాకుండా ప్రభాస్ రాగానే నవీన్ పోలిశెట్టి పాన్ ఇండియా కు తగ్గట్టుగా అన్ని భాషల్లో కలిపి అందరికీ వెల్కమ్ చెప్పాలా మాట్లాడించడు. ఇక తెలుగు తమిళ్ కన్నడ హిందీ భాషల్లో కూడా ప్రభాస్ చేత హాయ్ చెప్పేలా నవీన్ చాలా సరదాగా మాట్లాడించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X