twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది కదా ప్రభాస్ స్టామినా.. రాధేశ్యామ్ దెబ్బకు రికార్డులన్నీ పరార్.. మొత్తంగా 35 మిలియన్లు!

    |

    ప్రభాస్ సినిమా అప్ డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. గతేడాది ఆగస్టులో సాహో వచ్చాక.. అప్పటి నుంచి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ కూడా రాలేదు. ప్రభాస్ ఫస్ట్ లుక్, సినిమా టైటిల్ ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా? అని కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూశారు. ఇక అప్ డేట్ అనేది ఎప్పటికీ రాదనిఫిక్స్ అయి నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌పై తమ ఆగ్రహాన్ని చూపించారు ఫ్యాన్స్. కానీ వారి ఎదురుచూపులకు తగ్గ ఫలితం దక్కింది. నిన్న విడుదలైన రాధేశ్యామ్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాయి.

    రాకరాక వచ్చిన అప్‌డేట్..

    రాకరాక వచ్చిన అప్‌డేట్..

    ప్రభాస్ 20వ చిత్రానికి సంబంధించిన అప్ డేట్.. ఏడారిలో ఒయాసిస్సులు కనిపించినట్టుగా అనిపించింది అభిమానులకు. రాధేశ్యామ్ టైటిల్, ఫస్ట్ లుక్ రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. అప్పటి వరకు మిగతా హీరోల ఫ్యాన్స్ ట్రెండ్‌లను చూస్తూ వచ్చినా డార్లింగ్స్.. ప్రభాస్ స్టామినా ఏంటో చూపించారు.

    మిక్స్‌డ్ టాక్..

    మిక్స్‌డ్ టాక్..

    అయితే రాధేశ్యామ్ పోస్టర్‌పై భిన్న రకాల స్పందనలు వచ్చాయి. కొందరు కాపీ అంటూ మీమ్స్‌తో హల్చల్ చేశారు. అయితే ఇవేవీ రాధేశ్యామ్ ప్రభంజనాన్ని ఆపలేకపోయాయి. ఎన్ని రకాల ట్రోలింగ్స్ నడిచినా.. నిన్న మొత్తం రాధేశ్యామ్ హవానే నడిచింది.

    మాస్కులతో రాధేశ్యామ్..

    మాస్కులతో రాధేశ్యామ్..


    ప్రస్తుతం ప్రపంచమంతా మాస్కుల వెనకాలే దాక్కుంది. కరోనా భారిన పడకుండా కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ మాస్క్‌ను ధరించడం అత్యవసరమైంది. అందుకే అస్సాం పోలీసులు రాధేశ్యామ్‌కు మాస్కులు తొడిగారు. అలా మాస్కులు యాడ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంది.

    Recommended Video

    Radhe Shyam : కంచే ఫస్ట్ లుక్ తో పోలుస్తున్న Meme Pages, కానీ Prabhas రాయల్ లుక్ కేక || Oneindia
    సోషల్ మీడియాలో రికార్డులు..

    సోషల్ మీడియాలో రికార్డులు..

    రాధేశ్యామ్ సోషల్ మీడియాలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 24 గంటల్లో రాధేశ్యామ్ సోషల్ మీడియాను మోత మోగించింది. మొత్తంగా సోషల్ మీడియాలో 35 మిలియన్ల ఎంగేజ్మెంట్స్ సొంతం చేసుకుంది. అందులో 6.3 మిలియన్ల ట్వీట్‌తో రాధేశ్యామ్ ఇంతకు ముందున్న ట్విట్టర్ రికార్డులను చెరిపేసింది. ఇక సోషల్ మీడియాలో 3.2మిలియన్ల ఇంటరాక్షన్స్, 2.8మిలియన్ల లైకులను సాధించింది.

    English summary
    Radheshyam Social Media Records In 24 Hours. In just 24 hours, #RadheShyam took over the internet & won everyone's hearts! Heart suit Thanks to all the darling fans!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X