Tillu Square టిల్లు స్క్వేర్‌లో స్పెషల్ సర్ప్రైజ్.. ఏంటో తెలిస్తే మైండ్ బ్లాకే!

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, బ్యూటీఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. మార్చి 29న అనగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అటు సోషల్ మీడియాలోనూ ఈ సినిమా గురించే చర్చ నడుస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప్రేక్షకులకు సూపర్ స్పెషల్ సర్ ప్రైజ్ ఉందని తెలుస్తోంది. అసలు ఆ సర్పైజ్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం.

టిల్లు స్క్వేర్ సూపర్...

కామెడీ రొమాంటిక్ గా వచ్చిన డీజే టిల్లు సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2022లో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ గా, అటు ప్రేక్షకులను అలరించిన చిత్రంగా నిలిచింది. సిద్ధు జొన్నలగడ్డను ఓవర్ నైట్ స్టార్డమ్ ను తీసుకువచ్చింది. ఈ మూవీకి ముందు సిద్ధు ఎన్నో చిత్రాలు చేసిన రాని క్రేజ్, పాపులారిటీ.. ఈ ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ తీసుకువచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వేల్ గా రెండేళ్ల తర్వాత టిల్లు స్క్వేర్ తెరకెక్కింది.

Radhika Aka Neha Shetty Entry in Siddu Jonnalagadda Tillu Square Movie Full Details Here

పాజిటివ్ టాక్ తో...

ఎన్నో అంఛానాల నడుమ టిల్లు స్క్వేర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మొదటి షో నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతుంది. కామెడీ ఎంటర్టైన్మెంటుతో మరోసారి టిల్లు ఆకట్టుకున్నాడంటూ ట్వీట్స్ పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో టిల్లు అలియాస్ సిద్ధూ జొన్నలగడ్డకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ ఇప్పటికే దుమ్ములేపుతున్నాయి.

రోలర్ కోస్టర్...

మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్... మరోసారి కడుపుబ్బా నవ్వించాడు. ఈసారి డైరెక్టర్ మల్లిక్ విమల్ దర్శకత్వం వహించగా... సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో సిద్ధూ మరోసారి రాకింగ్ పెర్ఫామెన్స్ అని అంటూ రచ్చ చేస్తున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఆసక్తి కలిగించిందని కామెంట్స్ పెడుతున్నారు. అనుపమ స్క్రీన్ ప్రెజన్స్ బాగుందని.. మొత్తానికి ఈసినిమా వినోదాన్ని పంచే రోలర్ కోస్టర్ అని అంటున్నారు నెటిజన్స్.

Radhika Aka Neha Shetty Entry in Siddu Jonnalagadda Tillu Square Movie Full Details Here

స్పెషల్ సర్ ప్రైజ్...

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సూపర్ సర్పైజ్ ఉందని తెలుస్తోంది. అదేంటో కాదు.. మొదటి పార్టులో సిద్దూను నిండా ముంచిన రాధీకా అలియాస్ నేహశెట్టి ఈ సినిమాలో కూడా కనిపించింది. అయితే కేవలం 2 నుంచి 3 నిమిషాల నిడివితో రాధికా కనిపించి అలరించింది. ఇక రాధీకా ఎంట్రీకి థియేటర్స్ లో రచ్చ చేశారు ప్రేక్షకులు. అసలు విషయం ఏంటంటే.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ఇండియన్ స్పెషల్ టీమ్ ఫోర్స్ కు సంబంధించిన పోలీస్ ఆఫీసర్.

అనుపమ రోల్...

ఇక అనుపమ.. సిధ్దుతో ఓ పని చేయించుకునేందుకు లవ్ డ్రామా ఆడుతుంది. ఓ పని చేయమని అనుపమ అడిగితే.. టిల్లు నో చెప్తాడు. దీంతో అనుమప.. ఆ రాధికను పిలిచి బెదిరిస్తుంది. అలా మరోసారి మోసపోయి మనకు ఫన్ కలిగిస్తాడు సిద్ధు. మొత్తానికి టిల్లు స్వ్కేర్ లో రాధికా ఎంట్రీ మాత్రం అదుర్స్ అంటున్నారు. టిల్లన్న మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయ్యిందని.. ఇక అనుపమ అదరగొట్టిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X