‘రంగస్థలం’కు అవార్డుల పంట: ఉత్తమ నటుడు రామ్ చరణ్
ఇండియాలో ప్రముఖ రేడియో నెట్‌వర్క్ రేడియో సిటీ సీజన్ 2 సినీ అవార్డులను ఇటీవల ప్రకటించింది. మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ కావడంతో రెండో సీజన్‌లో మరింత గ్రాండ్‌గా నిర్వహించింది. రెండో సీజన్లో దాదాపు 1.36 కోట్ల మంది ఓటింగులో పాల్గొనేలా చేశారు.
ఈ సీజన్‌లో మొత్తం 20కి పైగా విభాగాల్లో అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడుగా రామ్‌చరణ్ తేజ్ (రంగస్థలం), ఉత్తమ నటిగా కీర్తీ సురేష్ (మహానటి) నిలిచారు. ఉత్తమ దర్శకుడి అవార్డును సుకుమార్(రంగస్థలం) గెలుచుకున్నారు. ఉత్తమ విలన్‌గా జగపతిబాబు (అరవింద సమేత వీరరాఘవ, గూఢచారి) నిలిచారు.

సుకుమార్
ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ రేడియో సిటీ సినీ అవార్డుల్లో రంగస్థలం ఐదు అవార్డులు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మాకు ఓటు వేసి అవార్డులు వచ్చేటట్లు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్తమ సహాయ నటి అనసూయ
గీత గోవిందం చిత్రంలోని ‘ఇంకేం ఇంకేం కావాలి' ఉత్తమ పాటగా, ఉత్తమ హాస్యనటుడుగా ప్రియదర్శి (నోటా, తొలిప్రేమ), ఉత్తమ సహాయ నటుడు ఆది పినిశెట్టి (రంగస్థలం), ఉత్తమ సహాయ నటిగా అనసూయ భరద్వాజ (రంగస్థలం) ఎంపికయ్యారు.

భరత్ అనే నేను
ఉత్తమ కథ, బెస్ట్ డైలాగ్‌ల కేటగిరిలో, ఉత్తమ కుటుంబ కథా చిత్రం కేటగిరీలో భరత్ అనే నేను చిత్రానికి అవార్డులు దక్కాయి. ఉత్తమ గాయనీ గాయకులుగా సిద్ శ్రీరామ్, చిన్మయ్ శ్రీపాద, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్‌ఎస్ థమన్ నిలిచారు.

పాయల్ రాజ్‌పుత్
బెస్ట్ డెబ్యూ అవార్డు పాయల్ రాజ్‌పుత్ (ఆర్ ఎక్స్ 100) చిత్రానికి లభించింది. ఉత్తమ లిరిక్ రైటర్‌గా రామజోగయ్య శాస్త్రి దక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications











