ఈషా రెబ్బా 'రాగల 24 గంటల్లో' ఫస్ట్‌లుక్ రిలీజ్

శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'రాగల 24 గంటల్లో'. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో శ్రీనివాస్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీనివాస్ కానూరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హీరో శ్రీరామ్ ముఖ్య పాత్రలో నటించారు.

24 మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం శనివారం హైద్రాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. హీరోయిన్ ఈషా రెబ్బ, హీరో శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, నటుడు కృష్ణ భగవాన్‌లు విచ్చేసి ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆవిష్కరించారు.

Ragala 24 Gantallo movie FirstLook Launch

ఈ సందర్బంగా హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. ''రాగల 24 గంటల్లో.. అనే ఈ టైటిల్ చూస్తుంటే మనకు బాగా తెలిసిందే అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం వాతావరణం గురించి తెలుసుకోవాలంటే ఇదే డైలాగ్ వింటుంటాం. కాబట్టి ఈ డైలాగ్ చాలా పాపులర్. ఇదే క్రేజీ టైటిల్‌ని తీసుకుని ఓ ఆసక్తికర కథను శ్రీనివాస్ రెడ్డి గారు అద్భుతంగా తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం ఉంది'' అన్నారు.

హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో నేను చాలా మంచి రోల్ చేశాను. నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నటనకు మంచి ఆస్కారం ఉన్న పాత్ర అది. ఇంత మంచి కథలో నన్ను హీరోయిన్ గా ఎంపిక చేసిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెబుతున్నాను. ఈ పాత్రతో నాకు మరింత మంచి గుర్తింపు వస్తుంది'' అన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. ''కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాలను బాగా డీల్ చేసే శ్రీనివాస్ రెడ్డి ఈ సారి సరికొత్త తరహాలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు. ఇది పూర్తిస్థాయి సీరియస్ సినిమా కాదు. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే.. అందరిలో ఆసక్తి రేపుతోంది. నా పాత్రకు కథలో చాలా కీలకంగా ఉంటుంది. అదేమిటన్నది ఇప్పుడు సస్పెన్స్'' అన్నారు.

నిర్మాత కానూరు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''ఈ కథ నన్ను బాగా ఆకర్షించింది. రెగ్యులర్ ఫార్మేట్‌తో వస్తున్న చిత్రాలకు బిన్నంగా ఉంటుంది. ప్రతి నిమిషాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే షూటింగ్ పూర్తీ కావొచ్చింది. త్వరలోనే విడుదల డేట్ ప్రకటిస్తాం. శ్రీనివాస్ రెడ్డితో సినిమా అంటే ఎంత సరదాగా ఉంటుందో అందరికి తెలుసు. అయన మంచి మనిషి. తప్పకుండా ఈ సినిమాతో ఆయనకు మంచి పేరొస్తుంది'' అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ .. ''రాగల 24 గంటల్లో అంటే ఏమిటో అందరికీ తెలుసు.. మనం వాతావరణం గురించి తెల్సుకోవాలంటే రేడియోల్లో, టీవీల్లో రాగల 24 గంటల్లో అని చెప్పేవారు. అయితే ఈ రాగల 24 గంటల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి అవి ఏమిటన్నదే ఈ సినిమా. ఇప్పటి వరకు కామెడీ, ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన నేను మొదటి సారి థ్రిల్లర్ సినిమా చేస్తున్నాను. అయిన ఇందులో ఫన్ అక్కడ మిస్ అవ్వదు. సత్యదేవ్, ఈషా రెబ్బా చక్కగా చేసారు. ఇక శ్రీ రామ్ మన తెలుగు హీరో అని అందరికి తెలుసు. అయన ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్నాడు. షూటింగ్ తో పాటు మిగతా కార్యక్రమాలన్నీ త్వరగా పూర్తిచేసి చిత్రాన్ని వచ్చే నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X