మండు వేసవిలో కాంచన.. భయపెట్టేందుకు సిద్ధం అవుతున్న లారెన్స్!
రాఘవ లారెన్స్ స్వీయ దర్శత్వంలో తెరక్కుతున్న చిత్రం కాంచన 3. ముని సిరీస్ లో రాబోతున్న నాలుగవ చిత్రం ఇది. ఈ సిరీస్ వరుసగా విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే. హర్రర్ జోనర్ లో లారెన్స్ సరికొత్త ప్రయోగం చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు. కాంచన 3 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం 2019 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ 18 న కాంచన 3 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారట. వేదిక, ఓవియా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లారెన్స్ చివరగా నటించిన చిత్రం శివలింగ. హర్రర్ కథతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.

ఇప్పటికే ఈ చిత్ర టాకీ పార్టీ పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించి చిత్రాన్ని వేసవి విడుదలకు రెడీ చేస్తారట. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











