చిరంజీవి కోసం రంగంలోకి బడా స్టార్.. ఆ సెంటిమెంట్ ప్రకారం విశ్వంభర హిట్టే!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన మార్కును చూపిస్తూ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. మధ్యలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన.. మళ్లీ ఎంట్రీ ఇచ్చి వరుసగా మూవీల మీద మూవీలు చేస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలోనే చిరంజీవి చాలా చిత్రాలు చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'విశ్వంభర' చేస్తున్నారు.

టాలీవుడ్ టాప్ హీరో చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీనే 'విశ్వంభర'. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట తీస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇందుకోసం ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్‌ను కూడా కేటాయించారు.

Raghava Lawrence Onboard For Chiranjeevi Starrer Viswambhara Movie

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కలిసి చేస్తున్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన ఈ ఏడాదిలోనే ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించి చిత్రీకరణ జరుగుతోంది. ఇలా ఇప్పటికే 30 శాతం కంటే ఎక్కువ టాకీ పార్ట్ కూడా పూర్తి అయిపోయింది. మిగిలిన దాన్ని కూడా త్వరగానే పూర్తి చేసేలా చిత్ర బృందం ప్లాన్లు చేసుకుంటోంది.

భారీ బడ్జెట్‌తో టెక్నికల్ వండర్‌గా రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు భాషలకు చెందిన నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం స్టార్ టెక్నీషియన్లను కూడా తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పుడు రాఘవ లారెన్స్‌ను రంగంలోకి దించినట్లు తెలిసింది.

Raghava Lawrence Onboard For Chiranjeevi Starrer Viswambhara Movie

పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమా కోసం స్టార్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన నేతృత్వంలో ఓ సాంగ్ షూట్ కూడా ప్రారంభం అయిందని సమాచారం. లారెన్స్ ఎంట్రీతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే గతంలో చిరంజీవితో ఆయన చేసిన 'ఇంద్ర', 'ఠాగూర్', 'ఖైదీ నెంబర్ 150' చిత్రాలు హిట్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం 'విశ్వంభర' కూడా సక్సెస్ అవుతుందని వాళ్లు అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబోలో చేస్తున్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతుంది.

More from Filmibeat

Read more about: viswambhara chiranjeevi chiru 156
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X