భయపెట్టడానికి సిద్ధం అవుతున్న లారెన్స్.. కాంచన 3 విడుదల తేదీ ఇదే!
రాఘవ లారెన్స్ స్వీయ దర్శత్వంలో తెరక్కుతున్న చిత్రం కాంచన 3. ముని సిరీస్ లో రాబోతున్న నాలుగవ చిత్రం ఇది. ఈ సిరీస్ వరుసగా విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే. హర్రర్ ఎలిమెంట్స్ తో థ్రిల్ చేస్తున్న లారెన్స్ విజయాలు అందుకుంటున్నాడు. కాంచన 3 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వేదిక, ఓవియా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న కాంచన 3ని మే 1న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంచన 3 పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంచన 3కి తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ నెలకొని ఉంది. దీనితో ఈ చిత్ర తెలుగు రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడిందట.

గత ఏడాది విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లారెన్స్ తెల్లటి గడ్డం, పంచె కట్టులో కనిపిస్తున్నాడు. కాంచన 2లో తాస్పి హీరోయిన్ గా నటించింది. కాంచన 3లో బిగ్ బాస్ భామ ఓవియా నటిస్తుండడంతో ఆసక్తిగా మారింది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications











