రాఘవ లారెన్స్ "కాంచన- 3" రిలీజ్ డేట్ వాయిదా
ముని, కాంచన, కాంచన 2 లాంటి హర్రర్ కామెడి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్ త్వరలో కాంచన-3తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మొదట ఏప్రిల్ 18న విడుదల చేయాలనుకున్నారు. కానీ పలు కారణాలతో సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
'కాంచన-3' చిత్ర బృందం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మే 1న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముని, కాంచన, కాంచన 2 తర్వాత... ఈ ఫ్రాంచైజీలో వస్తున్న 4వ సినిమా ఇది. మరింత హారర్, మరింత కామెడీ జోడించి తెరకెక్కించారట.

తెలుగు వెర్షన్‌ను లైట్ హౌస్ మూవీమేకర్స్ ఎల్ఎల్‍పి బ్యానర్ పై బి.మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్స్ అధినేత రాఘవ నిర్మించారు. సినిమా గురించి ఆయన గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ... రాఘవ లారెన్స్ తీసిన హర్రర్ కామెడీ సినిమాన్నీ సూపర్ హిట్లే. 'కాంచన-3' మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వేసవిలో ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతుంది అన్నారు.
రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, కొవైసరళ, కభీర్ దుహన్ సింగ్, శ్రీమన్, దేవదర్శిని, సత్యరాజ్, కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి- వెట్రి, సర్వెష్ మురారి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











