PelliSandaD Trailer: పాత రోజులను గుర్తు చేసిన టీమ్.. దర్శకేంద్రుడి ఎంట్రీ అదుర్స్

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు... తెలుగు సినీ ఇండస్ట్రీలోనే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో ఒకరు. వందకు పైగా చిత్రాలను తెరకెక్కించిన ఆయనను ప్రత్యేకమైన శైలి ఉంది. అందుకే ఈయన చిత్రాల్లో నటించాలని ప్రతి హీరో, హీరోయిన్లు కోరుకునే వాళ్లు. మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానం చాలా స్పెషల్‌గా ఉంటుంది. అందుకే ఆయన సినిమాల్లో నటించాలని చాలా మంది నటీమణులు అనుకునేవారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వానికి దూరంగా ఉన్నా.. సినిమాలకు మాత్రం దగ్గరగానే ఉన్నారు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించారాయన.

దర్శకేంద్రుడు తీసిన గుర్తుండిపోయే చిత్రాల్లో 'పెళ్లి సందడి' ఒకటి. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిదే టైటిల్‌తో వస్తున్న 'పెళ్లిసందD' సినిమా ద్వారా రాఘవేంద్రరావు నటుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా.. శ్రీలీలా హీరోయిన్‌గా వస్తున్న ఈ సినిమాను గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడిపోయింది.

Raghavendra Rao Acting Debut Movie PelliSandaD Trailer Released

'పెళ్లిసందD' మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోంది. అయితే, మధ్య కరోనా లాక్‌డౌన్లు వచ్చిన కారణంగా ఈ సినిమాకు వరుస ఆటంకాలు ఎదురయ్యాయి. దీని ప్రభావం షూటింగ్‌పై తీవ్ర స్థాయిలో చూపించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే చిత్రీకరణను పూర్తి చేసేశారు. అంతేకాదు, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసి విడుదలకు సిద్ధం చేశారు. ఇక, కొద్ది రోజులుగా ఈ మూవీ నుంచి పలు పాటలు, టీజర్ సహా ఎన్నో పోస్టర్లు విడుదలయ్యాయి. వాటన్నింటికీ భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా 'పెళ్లిసందD' మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ మేరకు తన ట్విట్టర్‌లో 'యాక్టర్‌గా పరిచయం అవుతోన్న రాఘవేంద్రరావు గారి 'పెళ్లిసందD' మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయనతో చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు' అని పోస్ట్ చేశాడు. ఇక, ఈ ట్రైలర్ పాత రోజులను గుర్తు చేసేదిగా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, డ్రామా, ఎమోషన్స్, రొమాన్స్ ఇలా అన్ని కోణాలను ఇందులో చూపించారు. ఫలితంగా ఇది అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పెళ్లిసందD' మూవీలో రాఘవేంద్రరావు స్టైలిష్ గెటప్‌లో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ఆయన అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. అలాగే, యాక్షన్ సీన్‌లోనూ భాగమైనట్లు చూపించారు. ఇక, ఈ సినిమాను ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం అందించారు. ఇక, ఈ మూవీకి రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణ కూడా చేశారు. అందుకే ఈ సినిమాపై అందరి ఫోకస్ పడిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X