ప్రభాస్ 'సాహూ'పై రాఘవేంద్రరావు కామెంట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' టీజర్ నిన్న(గురువారం) విడుదల చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే గురువారం 11.23 గంటలకు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన సాహూ పోస్టర్లు, మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలు భారీగా పెంచేయగా.. తాజాగా విడుదలైన ఈ టీజర్ 'సాహో' రేంజ్ ఎలా ఉండబోతోందని తెలిపింది. ఇక ఈ టీజర్ చూసిన సినీ ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇప్పటికే రాకమౌళి, పూరి జగన్నాథ్, సురేందర్ రెడ్డి లాంటి దర్శకులు తమ అభిప్రాయాలు చెప్పగా, తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనదైన స్టైల్ లో కామెంట్ చేశారు.
'సాహో' టీజర్ చూసిన వెంటనే రాఘవేంద్రరావు.. ట్విట్టర్ ద్వారా ప్రభాస్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రభాస్ మరోసారి సాహోతో తన స్టామినా చూపించబోతున్నాడని అనిపిస్తోన్నదని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ''టీజర్ బ్రహ్మాండంగా ఉంది. సాహో టీం అందరికి శుభాకాంక్షలు. ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని ఆయన తెలిపారు. టీజర్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న సాహూ టీజర్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సాహో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్, ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ ఒళ్ళు గగ్గుర్లు పొడిచేలా ఉంటుందని తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











