Gaddalakonda Ganesh:వరుణ్ తేజ్‌పై దర్శకేంద్రుడి కామెంట్స్.. ఆ క్యారెక్టర్!

తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది గద్దలకొండ గణేష్ (వాల్మీకి) మూవీ. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించారు.

సెప్టెంబర్ 20న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి, ఫిలిం క్రిటిక్స్ నుంచి పాజిటివ్ స్పందన తెచ్చుకుంది. చిత్రంలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ అందరి దృష్టినీ ఆకర్షించింది. తాజాగా ఈ సినిమా చూసిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వరుణ్ క్యారెక్టర్ పై తనదైన శైలిలో కామెంట్ చేశారు రాఘవేంద్ర రావు.

Raghavendra Rao comments on Varun Tejs Gaddalakonda Ganesh

''వరుణ్ తేజ్ ఎంతో అద్భుతమైన నటన కనబర్చాడు. గద్దలకొండ గణేష్ క్యారెక్టర్ లో ఇట్టే ఒదిగిపోయాడు వరుణ్. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించిన తీరు చాలా నచ్చింది. ముఖ్యంగా 'ఎల్లువొచ్చి గోదారమ్మ' పాట తెచ్చుకుంటున్న రెస్పాన్స్ నన్నెంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో పూజా హెగ్డే అభినయం అబ్బురపరిచింది'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు దర్శకేంద్రుడు.

రాఘవేంద్ర రావు చేసిన ఈ ట్వీట్ చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. తమ అభిమాన హీరోకి రాఘవేంద్ర రావు ఇచ్చిన సపోర్ట్ పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ట్వీట్ వైరల్ చేసేశారు. మరోవైపు గద్దలకొండ గణేష్ మూవీ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X