twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తిరుమల ఘాట్ రోడ్‌లో ప్రమాదం.. త‌ృటిలో తప్పించుకొన్న రాఘవేంద్రరావు!

    |

    Recommended Video

    Director Raghavendra Rao Escapes From Great Incident

    దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు ఘాట్ రోడ్‌లో ప్రయాణిస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం కొద్దిపాటి తేడాతో ప్రమాదం బయట పడింది. ఈ ఘటనలో రాఘవేంద్రరావుకు ఎలాంటి గాయాలు కాకుండా బయట పడ్డారు. అయితే ఆయన వద్ద పని చేస్తున్న మేనేజర్ గాయపడ్డట్లు సమాచారం. దర్శకేంద్రుడికి ఏమీ కాలేదని తెలియడంతో అభిమానులు ఊరపి పీల్చుకున్నారు.

    టిటిడి సభ్యుడుగా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా

    టిటిడి సభ్యుడుగా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా

    దర్శకేంద్రుడు టిటిడి సభ్యుడిగా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విధి నిర్వహణలో భాగంగా ఆయన తిరుమలకు వెళుతుండగా ఈ ప్రమాద సంఘటన చోటు చేసుకుంది.

    సొంతవాహనంలో వెళుతుండగా...

    సొంతవాహనంలో వెళుతుండగా...

    భక్తి ఛానల్ చైర్మన్, టీటీడీ సభ్యుడిగా హోదాలో ఉండటంతో ఆయనకు టిటిడి ప్రత్యేక వాహనం కేటాయించింది. తిరుమల వెళ్లిన సమయంలో సొంత కారులో కానీ, టిటిడి వాహనంలో కానీ ఆయన ప్రయాణిస్తుంటారు. తాజగా ఆయన సొంత వాహనంలో వెళుతుండగా ప్రమాదం జరిగింది.

    వెనక వాహనంలో దర్శకేంద్రుడు

    వెనక వాహనంలో దర్శకేంద్రుడు

    రాఘవేంద్రరావు ప్రయాణిస్తున్న వాహనానికి ముందు టిటిడి వాహనం వెళుతోంది. ఆ వాహనంలో రాఘవేంద్ర రావు మేనేజర్, టిటిడి సిబ్బంది ఉన్నారు. ముందు వాహనం అదుపు తప్పడంతో ప్రమాదానికి గురైంది.

    వెనక వాహనంలో క్షేమంగా

    వెనక వాహనంలో క్షేమంగా

    ఆ సమయంలో రెండు వాహనాల మధ్య చాలా తక్కువ దూరం ఉన్నట్లు తెలుస్తోంది. వెనుక వాహనంలో ఉండడం వలన రాఘవేంద్ర రావు క్షేమంగా బయటపడ్డారు. రాఘవేంద్ర రావు మేనేజర్ కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు.

    English summary
    Raghavendra Rao escapes miraculously from accident on ghat road. His manager got injured
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X