Bhola Shankar: చిరంజీవి కోసం దర్శకేంద్రుడు.. ఆ సెంటిమెంట్ ప్రకారమే సినిమా హిట్టే
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రాకెట్ వేగంతో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ మధ్య కాలంలోనే ఆయన ఎన్నో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ రేంజ్‌లో అలరించారు. అయితే, గత ఏడాది వరుసగా రెండు పరాజయాలను చవి చూసిన మెగాస్టార్.. ఈ సంక్రాంతికి మాత్రం 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టి సత్తా చాటడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే పలు చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నారు. అందులో తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కనున్న 'భోళా శంకర్' ఒకటి. దీన్ని ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరున్న మెహర్ రమేశ్ తీస్తుండడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇక, మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు రెండు మూడు పాటలను కూడా కంప్లీట్ చేసుకున్నారు.

'భోళా శంకర్' మూవీ కోసం వేసిన కోల్‌కతా సెట్‌లో ప్రస్తుతం దాదాపు వంద మందితో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సందర్శించారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు ఆయనతో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేసి 'భోళా శంకర్ మూవీ సెట్స్ నుంచి అద్భుతమైన ఫ్రేమ్. లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు సెట్స్‌ను సందర్శించి.. యూనిట్‌కు ఆశీస్సులు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో చిరంజీవి చూడాలిన ఉంది మూవీ సమయంలోనూ ఆయన వచ్చారు. అది సూపర్ హిట్ అయింది. మరి ఇప్పుడు' అంటూ పోస్ట్ చేసింది. అంటే.. రాఘవేంద్రరావు సెంటిమెంట్ ప్రకారం ఇది హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు.
'భోళా శంకర్' మూవీలో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











