For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టిక్కెట్లు వ్యాపారం ఏంటి ?.. ఇది దిగజారుడుతనమే.. పవన్ ను లాగుతూ వైసీపీ ఎంపీ సంచలనం!

  |

  ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల అమ్మకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ తయారు చేస్తుందని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వెబ్ సైట్ ను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుందని కూడా జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర చరిత్రలో సినిమా టికెట్ల అమ్మకాలు ఇలా ఒక వెబ్ సైట్ ద్వారా కంట్రోల్ చేయడం ఇదే మొదటిసారి. అయితే దీని గురించి ఇప్పటిదాకా ఒకరిద్దరు తప్ప సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో సినీ పరిశ్రమ గురించి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

   దేవాకట్టా నోరి వొప్పి

  దేవాకట్టా నోరి వొప్పి

  సినిమా టెక్కెట్లను కూడా ఆన్‌లైన్‌ ద్వారా విక్రయాలు జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించి, ఈ మేరకు 8వ తేదీన జీవో కూడా విడుదల చేసిన నేపథ్యంలో సినీ పరిశ్రమ నుంచి ముందుగ చిత్ర దర్శకుడు దేవాకట్టా స్పందించాడు. ''రైల్వే వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వాటి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించడం సబబే. కానీ ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన సినిమాల టిక్కెట్లను ప్రభుత్వం అమ్మాలనుకోవడం కరెక్ట్‌ కాదు'' అని ఆయన పేర్కొన్నారు.

  అంతే కాక ఇక మీదట సినిమాలు తీసిన నిర్మాతలు ప్రైవేట్‌ కాంట్రాక్టర్ల మాదిరి డబ్బుల కోసం ప్రభుత్వం ముందు క్యూలో నుంచోవాలేమో లేదంటే ప్రభుత్వమే సినిమాల నిర్మాణం కోసం బడ్జెట్‌ కేటాయిస్తుందా?'' అంటూ సోషల్‌ మీడియాలో వ్యంగ్యంగా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ఈ అంశం గురించి ఆయన కాకుండా మరెవరూ స్పందించిన దాఖలాలు లేవు.

  బహిరంగ రహస్యం

  బహిరంగ రహస్యం

  సినీ పరిశ్రమకు పెద్దగా అందరూ అభివర్ణిస్తున్న చిరంజీవి కూడా ఎక్కడా మాట్లాడలేదు. పరిశ్రమలోని ప్రముఖులు మాట్లాడుకుంటున్నారేమో తెలీదు కానీ ఉత్తర్వులు జారీ అయి చాలా రోజులైనా అధికారికంగా ఎవరు మాట్లాడ లేదన్నది బహిరంగ రహస్యం. చివరకు రోడ్ల విషయంలో చీల్చి చెండాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం నోరు విప్పలేదు.

  టిక్కెట్లు వ్యాపారం ఏంటి ?

  టిక్కెట్లు వ్యాపారం ఏంటి ?

  దీంతో రంగంలోకి దిగిన రఘురామకృష్ణంరాజు డబ్బుల కోసం ఇప్పటి వరకు చేస్తున్న వ్యాపారాలు చాలవన్నట్లు ఇప్పుడు సినిమా టిక్కెట్లు అమ్ముకోవడానికి సిద్ధమయ్యారని, అసలు సినిమా హాళ్లు, టిక్కెట్లు పై మీ పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న గంగవరం పోర్టు ను ఎందుకు అమ్మారు? డబ్బులు కావాలి అంటే లాభాల్లో ఉన్న సంస్థను నడపకుండా అమ్ముకుంటూ టిక్కెట్లు వ్యాపారం ఏంటి ? అని ఆయన ప్రశ్నించారు.

  పరిశ్రమ పై జరుగుతున్న దండయాత్ర

  పరిశ్రమ పై జరుగుతున్న దండయాత్ర

  అసలు మనం ఎవరం ఈ వ్యాపారం చేయడానికి? మీరు సినిమా టిక్కెట్లు వ్యాపారం చేస్తున్నట్లు రేపు ఒక వేళ కేంద్ర ప్రభుత్వం భారతి సిమెంట్ లో ఉత్పత్తులకు తనే ధర నిర్ణయించి అమ్ముకుని వీలు ను బట్టి డబ్బులు ఇస్తామంటే ఎలా ఉంటుందో ఆలోచించండని ప్రశ్నించారు. ఇక చిరంజీవి సహ సినిమా రంగ ప్రముఖులు ముందుకు వచ్చి మాట్లాడాలన్న ఆయన రియల్ హీరోలు అందరూ మీ పరిశ్రమ పై జరుగుతున్న దండయాత్ర పై స్పందించాలని అన్నారు.

  Gem Movie Team Special Interview With Racha Ravi
  దిగజారుడుతనం

  దిగజారుడుతనం

  టికెట్ల వ్యాపారం చేయడానికి సిద్ధమవడం దిగజారుడుతనం అని పేర్కొన్న ఆయన నెల రోజులు సినిమా టికెట్‌ డబ్బులు మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు? ఈ రోజుల్లో ఏ సినిమా వారం, పది రోజులకు మించి ఆడటం లేదు. ఇలాంటి వసూలు చేసిన డబ్బులు నెల రోజులకు ఇస్తే ఏ సినిమా డబ్బులు ఎవరికి వెళ్తున్నాయో ఎలా తెలుస్తుంది? ఇంత సమస్య వచ్చినా ఒక్క హీరో కూడా స్పందించకపోవడం దారుణం అని యన్ అన్నారు. పవన్‌ కల్యాణ్‌పై కోపంతోనే ఇదంతా వచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు.

  English summary
  ycp rebel mp raghu rama krishnam raju demands pawan kalyan to respond on ap government ticket booking policy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X