ముంబై నటి జెత్వానీపై వైసీపీ పైశాచికం.. మరో బాంబు పేల్చిన రఘురామరాజు
ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీపై విజయవాడ మాజీ జెడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్ వేధింపుల వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఓ పారిశ్రామిక వేత్త ఎవరనే విషయంపై ఆయన సెటైర్లు వేశారు. ఆ పారిశ్రామికవేత్త ఎవరో అనే విషయం త్వరలోనే బయటకు వస్తుందని తెలిపారు. ఆయన చెప్పిన వివరాల్లోకి వెళితే..
కుక్కల నాగేశ్వరరావు కుమారుడికి సంబంధం లేదు. పెద్ద పారిశ్రామిక వేత్తకు ఈ నటికి సంబంధం ఉండి ఉంటుంది. వైఎస్ జగన్‌ను ఆ పారిశ్రామికవేత్త వేడుకొంటే ఆయన ఈ విషయంపై చూసుకోవాలని పోలీసులకు ఆదేశించారని అనుకొంటా. ఆ క్రమంలోనే ఆమెపై కేసు పెట్టి ఉంటారని అనుకొంటాను అని రఘురామ రాజు తెలిపారు.

అయితే కుక్కల విద్యాసాగర్‌కు వ్యాపారాలు ఉన్నాయి. పలు నగరాలకు తిరుగుతుంటారు. ఆ వ్యాపార సంబంధాల వల్లనే ఆయనను ఈ కేసులో ఎంపిక చేసుకొని ఉంటారు. ఆయన నిమిత్తమాత్రుడే అనుకొంటాను. పారిశ్రామికవేత్తనే కీలకం అని భావిస్తాను. ఆ పారిశ్రామికవేత్తను అరెస్ట్ చేయాలంటే మహారాష్ట్ర పోలీసుల అనుమతి అవసరం ఉంటుంది అని రఘురామ కృష్ణం రాజు అన్నారు.
ముంబై నటి జెత్వానీపై 5 లక్షల రూపాయల డిమాండ్ చేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసులందరూ వెళ్లి ఆమెను, ఆమె కుటుంబాన్ని కిడ్నాప్ చేయడానికి ఎంత ఖర్చు అయి ఉంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ముంబై పోలీసులకు సమాచారం లేకుండా తీసుకొస్తారా? ఈ వ్యవహారంలో పోలీసు అధికారులు, వైసీపీ కీలక నేత శిక్ష అనుభవిస్తారా? అనేది వేచి చూడాలి. ఈ కేసు చూస్తే.. ఉన్నట్టుండి.. నన్ను అరెస్ట్ చేసిన విధంగానే ఉంది అని అన్నారు.
కాదంబరి జెత్వానీని హింసించడం చాలా బాధాకరం. ఆమెను వేధించినప్పుడు ఏదైనా వీడియోను ముంబై వాళ్లకు చూపించి ఉంటారేమో. కుక్కల విద్యాసాగర్‌కు పోర్టు బిజినెస్‌లు ఉన్నాయి.ఆమెతో చిన్నపాటి పరిచయం ఉండొచ్చు. ఇతను ఏదైనా సినిమా తీసి ఉండొచ్చు.ఆ పరిచయంతో అతను కూడా అడ్వాన్స్ అయి ఉంటాడు. వైసీపీలో నగ్నంగా వీడియోలు తీయిచుకోవడం సంప్రదాయంగా మారింది అని సెటైర్ వేశారు.


Click it and Unblock the Notifications











