‘రహస్యం’ వేడుకలో సందడి చేసిన కొణిజేటి రోశయ్య
శైలేష్ , శ్రీ రితిక జంటగా సాగర్ శైలేష్ దర్శకత్వంలొ భీమవరం టాకీస్‌పై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తొన్న చిత్రం 'రహస్యం'. ప్రసాద్ ల్యాబ్స్‌లొ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మాజీ సిఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ.. 'నిర్మాత రామసత్యనారాయణ వంద చిత్రాలకు చేరువకావడం సంతోషంగా ఉంది. మంచి అభిరుచి ఉన్న నిర్మాత. చిన్న చిత్రాల ద్వారా డబ్బు ఎలా సంపాదించాలన్నది రామ సత్యనారాయణ చూసి నేర్చుకోవచ్చు' అన్నారు.

రామ సత్యనారాయణ మాట్లాడుతూ..కంటెంట్ బాగుంటేనే ఈ రోజుల్లో చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా ఆడుతుంది. కంటెంట్ లేని సినిమాలను ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిప్పికొడుతున్నారు. 'రహస్యం' కంటెంట్ ఉన్న చిత్రం, ప్రేక్షకులు తప్పకుండా నచ్చుతుందని' అన్నారు.
మా సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టే... నాయక్, పూరీ జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ, రాజ్ కందుకూరి, శ్రీకాంత్ లాంటి వారు తమ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు రామ సత్యానారాయణ. హీరొ శైలేష్ మాట్లాడుతూ.. హార్రర్, యాక్షన్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయని తెలిపారు.


Click it and Unblock the Notifications











