రెండు అరటిపళ్లకు 442.50 బిల్లు.. స్టార్ హీరోకు ఊరట

బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌కు ఇటీవల చండీగఢ్‌లో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. జిమ్‌లో వర్కవుట్లు చేస్తే రెండు అరటి పళ్లు ఆర్డర్ చేస్తే గూబ గుయ్‌మనిపించే విధంగా బిల్లు వేసిన హోటల్‌కు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం చండీగఢ్‌లోని జే‌డబ్ల్యూ మారియట్ హోటల్‌లో విడిది చేసిన రాహుల్‌కు ఈ సంఘటన ఎదురైంది.

రాహుల్‌కు ఎదురైన ఘటనపై చండీగఢ్‌లో ఎక్సైజ్, టాక్సేషన్ శాఖకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్ మన్‌దీప్ బ్రార్ విచారణకు ఆదేశించారు. రాహుల్‌ బోస్‌కు రెండు అరటిపళ్లకు రూ.442.50 బిల్లు వేసిన హోటల్ సిబ్బందికి శుక్రవారం ఎక్సైజ్, పన్నులశాఖ తాకీదులు పంపింది. టాక్స్ ఫ్రీ వస్తువులపై పన్ను వేసినందుకు గానూ ఐటీ చట్టం సెక్టర్ 35 కింద నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Rahul Bose case: Chandigarh taxation department sent to notice to Hotel

జేడబ్ల్యూ మారియట్ హోటల్ ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేసి విచారణకు ఆదేశించారు. త్వరలోనే నివేదిక అందజేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాహుల్ బోస్ చేసిన ట్వీట్ ఆధారంగా ఈ కేసును సుమోటగా తీసుకొన్నట్టు సమాచారం.

ఇటీవల చండీగఢ్‌ పర్యటించిన రాహుల్ బోస్ మారియట్ హోటల్‌ దిగారు. ఆ హోటల్‌లో వర్కవుట్లు చేస్తూ రెండు అరటిపళ్ల కోసం సిబ్బందికి ఆర్డర్ ఇచ్చాడు. రెండు అరటి పళ్ల కోసం హోటల్ యాజమాన్యం ఇచ్చిన బిల్లు చూసి రాహుల్ తలతిరిగినంత పనైందట. రెండు అరటి పళ్ల ఆర్డర్‌ చేస్తే జీఎస్టీ, ఇతర పన్నులతోపాటు అక్షరాల రూ.442.50 బిల్లును ఇచ్చారట. ఈ బిల్లును ఫ్రూట్ ప్లాటర్ అని పేర్కొని బిల్లును రూపొందించారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X