బాలీవుడ్ సినిమాపై రాహుల్ గాంధీ మోజు.. థియేటర్‌కు వెళ్లి చూసిన యువ నేత

బాలీవుడ్ యువ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన ఆర్టికల్ 15 సినిమాపై సినీ విమర్శకులు ప్రశంసలు గుప్పిస్తుంటే.. మరోవైపు రాజకీయ నాయకులు కూడా ఓ సినిమాపై మోజు పడుతున్నారు. ఆ జాబితాలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చేరారు. అనుభవ్ సిన్హా తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ పోలీసు ఆఫీసర్‌గా నటించారు.

Rahul Gandhi witnesses Ayushmann Khurranas Article 15

విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్న ఈ చిత్రాన్ని ఇటీవల రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఓ మాల్‌లో వీక్షించారు. ఈ పందర్భంగా ఆయుష్మాన్ నటనను చూసి రాహుల్ ఇంప్రెస్ అయినట్టు సమాచారం. తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఈ సినిమాను వీక్షించినట్టు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి తప్పించుకొన్న రాహుల్.. ఇప్పుడిప్పుడే ప్రజా జీవితంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Rahul Gandhi witnesses Ayushmann Khurranas Article 15

ఇప్పటి వరకు ప్రేమ కథా చిత్రాలు, విలక్షణ పాత్రలకే పరిమితమైన ఆయుష్మాన్ తొలిసారి ఖాకీ డ్రెస్‌లో కనువిందు చేశారు. పవర్ ప్యాక్ పాత్రలో నటించి మెప్పించడం గమనార్హం. యాక్షన్ హీరోగా కూడా మంచి మార్కులు సంపాదించడం విశేషం.

సమాజంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలను ఆధారంగా చేసుకొని, వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ప్రజల మైండ్ సెట్‌ను మార్చేందుకు దర్శకుడు ప్రయత్నించడం ఈ సినిమా ప్రత్యేకత. ఉత్తరాదిలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X