Rahul Ramakrishna : ఉదయమే బూతు, సాయంత్రానికి కూడా అదే, అందరూ పత్తిత్తులేనా?
కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రాహుల్ రామకృష్ణ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి. ఆయన లీడ్ రోల్ లో చేసిన సినిమా ఒకటి వినాయక చవితి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ షేర్ చేసిన రాహుల్ రామకృష్ణ మా సినిమాకు గు*లో దమ్ము ఉంది అంటూ కామెంట్ చేయడమే కాక, సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలకు మా సినిమా ఏ మాత్రం భయపడదు అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ బూతులతో కూడిన మెసేజ్ లు పోస్ట్ చేసి సాయంత్రానికి మళ్లీ మరో ట్వీట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

వరుస సినిమాలు చేస్తూ
నటుడిగా రాహుల్ రామకృష్ణ మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలంగాణ యాసలో తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాల్లో నటిస్తూ రాహుల్ రామకృష్ణ కమెడియన్గా టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంటున్నారు అని చెప్పక తప్పదు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన జాతిరత్నాలు సినిమాలో కూడా ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి తో పాటు నటించి మంచి క్రేజ్ సంపాదించాడు. ఆ సినిమాలో నా వల్ల ఇబ్బంది అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అనే ఒక డైలాగ్ ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఎందుకలా
అలాంటి నటుడు బ్యాక్ గ్రౌండ్ కలిగిన హీరోల గురించి మాట్లాడుతూనే బూతులతో విరుచుకు పడతాడు అని ఎవరూ ఊహించి ఉండరు. కానీ రాహుల్ రామకృష్ణ అనూహ్యంగా అలాంటి కామెంట్ చేసి ఇప్పుడు టాలీవుడ్ మొత్తం మీద చర్చనీయాంశంగా మారారు. విషయం ఏంటంటే రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన నెట్ అనే సినిమా ఈ నెల 10వ తేదీన అంటే వినాయక చవితి సందర్భంగా జి5 యాప్ ద్వారా విడుదల అవుతోంది.

ఆ హీరోలను టార్గెట్ చేస్తూ
ఈ సినిమాని ఇంటర్నెట్ అలాగే పోర్న్ కు సంబంధించిన విషయాలను కలుపుతూ రూపొందించారని చెబుతున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ లాంటివి ఈ సినిమా మీద ఆసక్తి పెంచాయి అని చెప్పక తప్పదు. అయితే తన సినిమాని ప్రమోట్ చేసుకునే పనిలో భాగంగా నిన్న తన సినిమా ట్రైలర్ షేర్ చేసి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికి మా సినిమా భయపడదు ఎందుకంటే మా సినిమాకు గు*లో దమ్ము ఉంది అని రాహుల్ రామకృష్ణ పేర్కొన్నాడు.

గు*లో దమ్ముంది
మళ్ళీ దీన్నే ప్రస్తావిస్తూ మా సినిమాకు గు*లో దమ్ముంది అని మళ్ళీ పేర్కొన్నాడు. నిజానికి రాహుల్ రామకృష్ణ కొద్ది రోజుల క్రితం తన ప్రేయసితో కలిసి వైన్ తాగుతూ పెట్టిన ఇంస్టాగ్రామ్ వీడియో కూడా ఇలాగే చర్చనీయాంశంగా మారింది. దీంతో రాహుల్ రామకృష్ణ కావాలనే ఇలా ట్వీట్ పెట్టాడా లేక మద్యం మత్తులో ఏమైనా చేశాడా అనే అనుమానాలు కూడా కలిగాయి.

అందరూ పత్తిత్తులే అన్నమాట
అయితే సాయంత్రానికి మళ్ళీ తనను ట్రోల్ చేస్తున్న వారందరినీ ఉద్దేశిస్తూ ఓహో ట్విట్టర్ లో అందరూ పత్తిత్తులే అన్నమాట అంటూ ట్వీట్ చేయడంతో రాహుల్ రామకృష్ణ ఎలాంటి ప్రభావానికి లోనై ఈ ట్వీట్లు పెట్ట లేదని పూర్తి స్పృహ తోనే ఆయన తన సినిమా ప్రమోషన్ చేసుకుంటూ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోల గురించి ట్వీట్ చేశారు అనే విషయం అర్థమవుతోంది. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుంది అనేది వేచి చూడక తప్పదు.


Click it and Unblock the Notifications











