రాహుల్ రామకృష్ణకు తీవ్ర విషాదం.. సోదరుడి దారుణ మరణంపై ప్రధాని, తెలంగాణ సీఎంకు లేఖ!

తెలుగు సినీ నటుడు రాహుల్ రామకృష్ణ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. డ్రగ్స్ బారిన పడిన సోదరుడు మరణంతో దిగ్బ్రాంతికి గురయ్యాడు. తనకు ఎదురైన బాధను సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. ప్రమాదకరమైన మత్తు, మాదక ద్రవ్యం కారణంగా విషాదకరమైన సంఘటన జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు ఎదురైన విషాదం మరొకరికి ఎదురు కాకూడదని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రధాని మోదీకి సోషల్ మీడియా ద్వారా లేఖ రాశారు. ఇలాంటి పరిస్థితులపై ఉక్కుపాదం మోపాలని ఆయన సూచించారు. రాహుల్ రామకృష్ణ రాసిన లేఖ ఏమిటి? ఆయన సోదరుడి మరణానికి కారణం ఏమిటనే వివరాల్లోకి వెళితే..

రాహుల్ రామకృష్ణ సోదరుడు ప్రమాదకరమైప కెమికల్ డ్రగ్‌కు అలవాటు పడ్డాడు. మితి మీరి ఉపయోగించడం ఆరోగ్య పరిస్థితి క్షిణించింది. దాంతో మార్చి 26వ తేదీన తీవ్రమైన అనారోగ్యానికి గురై మరణించాడు. దాంతో ఆయన కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పారాక్వాట్ కెమికల్ ఎక్కడ పడితే అక్కడ స్వేచ్చగా మార్కెట్లో లభ్యమవుతున్నది. యువత దానిని ఉపయోగించుకొని తీరని నష్టానికి గురి అవుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన డ్రగ్స్‌ను వెంటనే నిషేధించాలి. అనుమతి లేకుండా, లేదా అక్రమంగా అమ్మకుండా ప్రభుత్వాలు చట్టం రూపొందించాలి. అధికారులు కఠని చర్యలు తీసుకోవాలి అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Rahul Ramakrishna Brother died due to paraquat poisoning

పారాక్వాట్ చాలా ప్రమాదకరమైనంది. వ్యవసాయ రంగంలో కీటకాలను నాశనం చేసే క్రిమి సంహారక పాయిజన్. నోటి ద్వారా ఉపయోగించడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బ తింటున్నాయి. లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ సంభిస్తున్నది. దీని ప్రమాదం బారిన పడితే బయటకు రావడానికి సరైన వైద్యం లేదు. చాలా కేసుల్లో బతికే ఛాన్సులు చాలా తక్కువ. కాబట్టి ఇలాంటి డ్రగ్ సాధారణ ప్రజలకు, యువతకు అందుబాటులో లేకుండా చేయాలి. సరైన డాక్యుమెంట్ లేకుండా మార్కెట్లో అమ్మకూడదు అని రాహుల్ రామకృష్ణ తన బాదను వ్యక్తం చేశారు.

తన సోదరుడి మరణం తర్వాత రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. గౌరవనీయులైన తెలంగాణ సీఎంవో, ప్రధానమంత్రి కార్యాయం అధికారులకు నా మనవి. పారక్వాట్ (Paraquat) పాయిజనింగ్‌తో నా సోదరుడు మరణించాడు. ఆ డ్రగ్ అత్యంత ప్రమాదకరం. అలాంటి కెమికల్ వాడటం వల్ల ఎందరో మరణం బారిన పడుతూ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. చాలా చోట్ల విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఇలాంటి కేసులు రావడం వైద్యుల కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి ప్రమాదకరమై కెమికల్‌ను బ్యాన్ చేసి ప్రాణాలకు కాపాడండి అని రాహుల్ రామకృష్ణ వేడుకొన్నారు.

రాహుల్ రామకృష్ణ సోదరుడి మరణంతో మరోసారి డ్రగ్స్, హెర్బల్ కెమికల్స్ లాంటి వాడకంపై చర్చ భారీగా జరుగుతున్నది. రాహుల్ పెట్టిన పోస్టుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి బారిన యువతీ, యువకులు పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదు అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X