‘మిఠాయి ’ ట్రైలర్: నవ్వులు పూయించి ప్రియ దర్శి, రాహుల్ రామకృష్ణ
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల ద్వారా పాపులర్ అయిన కమెడియన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారు. తాజాగా ఈ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో ఓ వినోదాత్మక చిత్రం తెరకెక్కుతోంది. 'మిఠాయి' అనే డిఫరెంట్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ప్రశాంత్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెడ్ యాంట్స్ బ్యానర్‌పై ప్రభాత్ కుమార్ నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఫుల్ ఫన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వించనున్నాయి. తమదైన మేనరిజంతో ఈ ఇద్దరూ అదరగొట్టారు. ట్రైలర్ చివర్లో రాహుల్, ప్రియదర్శి దుబాయ్ షేక్ వేషాల్లో కనిపించడం ఫణ్నీగా ఉంది. గాడిదపై కూర్చున్న రాహుల్ భయపడి పారిపోవడం, ఆ తర్వాత ప్రియదర్శి ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి.

'మిఠాయి' చిత్రాన్ని నవంబర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవివర్మ నీలమేఘం, సంగీతం: వివేక్ సాగర్, ఎడిటర్: గారీ బిహెచ్, నిర్మాణ సంస్థ: రెడ్ యాంట్స్, నిర్మాత: డాక్టర్ ప్రభాత్ కుమార్, దర్శకత్వం: ప్రశాంత్ కుమార్.


Click it and Unblock the Notifications











