మహేష్, పవన్ మల్టీస్టారర్.. సీరియస్ గా ఆలోచిస్తున్న యంగ్ డైరెక్టర్!

టాలీవుడ్ లో కూడా మల్టీస్టారర్ సినిమాల జోరు మళ్ళీ పెరిగిందని చెప్పవచ్చు. అప్పట్లో గోల్డెన్ హీరోస్ తరహాలో నేటితరం స్టార్ హీరోలు కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. కథ సెట్టయితే సినిమా చేయడానికి అభ్యంతరం లేదని అంటున్నారు. RRR సినిమాతో ఆడియెన్స్ కి కొత్త తరహా కోరికలు పుట్టుకొస్తున్నాయి.

RRR కారణంగా..

RRR కారణంగా..

రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లాంటి బడా హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఒక అద్భుతమనే చెప్పాలి. రాజమౌళి సెట్ చేసిన RRR కాంబినేషన్ కి అభిమానులు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అయితే మా స్టార్ హీరోలు కూడా అలానే మరొక స్టార్ హీరోతో సినిమా చేస్తే బావుంటుందని నెటీజన్స్ దర్శకులను కోరుతున్నారు. అందులో ఎక్కువగా పవన్ - మహేష్ కాంబినేషన్ పైనే కామెంట్స్ వస్తున్నాయి.

ఆ మాట నిజమవ్వాలి..

ఆ మాట నిజమవ్వాలి..

కుదిరితే పవన్ కళ్యాణ్ మహేష్ బాబులను ఒకే ఫ్రేమ్ లో చూపించాలని ఉందని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అతను చెప్పిన మాటలు ఆడియెన్స్ నిజమవ్వాలని కోరుకుంటున్నారు. చి.ల.సౌ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నటుడు రాహుల్ రవీంద్రన్ ఆ తరువాత నాగార్జునతో మన్మథుడు 2 చేసిన విషయం తెలిసిందే.

మహేష్ - పవన్ మల్టీస్టారర్ కోసం...

మహేష్ - పవన్ మల్టీస్టారర్ కోసం...

పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమా చేయాలని తాను సీరియస్ గా ఆలోచిస్తున్నాను అని రాహుల్ తెలిపిన కారణంగా ఆ ఇద్దరి హీరోల అభిమానుల్లో ఒక్కసారిగా ఆశలు పెరిగాయి. కానీ ఈ దర్శకుడు వారితో సినిమా చేయాలంటే ఇంకా చాలా ఎదగాలని అంటున్నారు. మన్మథుడు 2 సక్సెస్ కాకపోవడంతో రాహుల్ నెక్స్ట్ ఒక లవ్ స్టోరీతో రాబోతున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Vijay Sethupathi Out From Allu Arjun's Pushpa Movie
వారు సిద్ధమే..

వారు సిద్ధమే..

మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమాతో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి సిద్ధమే అని చెప్పేశాడు. ఇక గోపాల గోపాల సినిమా ద్వారా వెంకీతో నటించి పవర్ స్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విధంగా మల్టీస్టారర్ సినిమాలకు వారిద్దరు సిద్ధమే అని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మరి భవిష్యత్ లో ఈ స్టార్స్ కలిసి సినిమా చేస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X