twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో నిజ జంట: కీలక పాత్రల్లో ప్రముఖ డైరెక్టర్, సింగర్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్లు తన పిల్లలను హీరోలుగా పరిచయం చేశారు. ఈ క్రమంలోనే చాలా మంది కుర్రాళ్లు టాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే అద్భుతమైన టాలెంట్‌తో సక్సెస్‌ను అందుకుని స్టార్లుగా వెలుగొందుతున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటికీ సక్సెస్ ట్రాక్ ఎక్కలేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాంటి వారిలో అక్కినేని వారసుడు, నాగార్జున కుమారుడు అఖిల్ ఒకడు. ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతోన్న అతడు ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేదు.

    ఏకాంతంగా ఒకే ఇంట్లో సినీ జంట ఎంజాయ్: అతడు బట్టల్లేకుండా.. ఆమె ప్రైవేట్ ఫొటోలు బయటకు!ఏకాంతంగా ఒకే ఇంట్లో సినీ జంట ఎంజాయ్: అతడు బట్టల్లేకుండా.. ఆమె ప్రైవేట్ ఫొటోలు బయటకు!

    వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న అక్కినేని అఖిల్.. నటించిన తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. కానీ, కరోనా రెండు లాక్‌డౌన్ల కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. దీనికితోడు కొన్ని రీషూట్ల వల్ల ఇది మరింత లేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఫస్ట్ కాపీ రెడీ అయింది. దీనిపై చిత్ర యూనిట్ సంతృప్తిగా ఉంది. దీంతో దీన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

    Rahul Ravindran and Chinmayee Sripada Key Roles in Akhil Most Eligible Bachelor

    'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీపై అక్కినేని అఖిల్‌తో పాటు ఆ ఫ్యామిలీకి చెందిన అభిమానులు అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఈ యంగ్ హీరో.. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి చాలా రోజులు డేట్స్ కేటాయించాడు. ఇక, ఈ మధ్యనే దీన్ని పూర్తి చేసేసి మరో సినిమాను పట్టాలెక్కించేశాడు. ఇక, త్వరలోనే మంచి డేట్ చూసుకుని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీని నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది.

    చిరంజీవి బర్త్‌డేకు బన్నీ అందుకే రాలేదు.. పవన్, చరణ్ సహా వాళ్లంతా వేస్ట్: ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలుచిరంజీవి బర్త్‌డేకు బన్నీ అందుకే రాలేదు.. పవన్, చరణ్ సహా వాళ్లంతా వేస్ట్: ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

    'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషించారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో పాటు అతడి భార్య సింగర్ చిన్మయి శ్రీపాద జంటగా నటించారట. నిజ జీవితంలో భార్య భర్తలైన వీళ్లిద్దరూ అఖిల్ సినిమాలోనూ అదే పాత్రలను చేశారని తెలుస్తోంది. మూవీ మొత్తానికే ఎంతో ముఖ్యమైన ఈ రోల్స్ చాలా బాగా వచ్చాయని అంటున్నారు. అయితే, వీళ్లిద్దరి ఏ పాత్రలు చేశారన్న దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు.

    Rahul Ravindran and Chinmayee Sripada Key Roles in Akhil Most Eligible Bachelor

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో అఖిల్ రొమాంటిక్ రోల్‌లో నటించాడు. అతడికి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే పాత్రను అదిరిపోయేలా క్రియేట్ చేశారు. ఇక, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు.

    English summary
    Tollywood Young Hero Akhil Akkineni Signs New Project In geeta arts 2 banner. This Film Directed By Bommarillu Bhaskar. Rahul Ravindran and Chinmayee Sripada Key Roles in This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X