For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నచ్చింది గర్ల్ ఫ్రెండూలో దోస్త్ పాటను ఆవిష్కరించిన రియల్ ఫ్రెండ్స్ నారా రోహిత్, శ్రీవిష్ణు

  |

  శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్న నచ్చింది గర్ల్ ఫ్రెండూ చిత్రం విడుదలకు ముస్తాబువుతున్నది. ఇప్పటికే ఫీల్ గుడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్నారు. జెన్నీ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రంలో కమెడియన్ మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న నచ్చింది గర్ల్ ఫ్రెండూ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు.

  Rahul Simpligunjs Friendship song of Nachchindi Girl friend unvieled by Nara Rohit, Sri Vishnu

  అయితే ఆదివారం ఇంటర్నేషన్ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి 'దోస్త్ అంటే నువ్వేరా.. ఫ్రెండ్ అంటే నువ్వేరా..' అనే లిరికల్ సాంగ్‌ను నిజజీవితంలో మంచి మిత్రులు అయిన టాలెంటెడ్ హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి విడుదల చేశారు. పాటను అద్బుతంగా ఆస్వాదించిన రోహిత్, శ్రీవిష్ణు చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. ఈ పాటను గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో మున్నా ఎస్డీ సాహిత్యాన్ని అందించగా బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటలో టాలీవుడ్ రియల్ ఫ్రెండ్స్ అయిన ప్రభాస్- గోపీచంద్, పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్, ఎన్టీఆర్- రామ్ చరణ్, మహేష్ బాబు-వంశీ పైడిపల్లి ఇలాంటి వారిని చూపిస్తూ స్నేహం గొప్పతనాన్ని ఆవిష్కరించారు.

  హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. ప్రెండ్ షిష్ డే సంద‌ర్భంగా విష్ణు తో క‌ల‌సి ఈ సాంగ్ రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ప్రొడ్యూస‌ర్ అట్లూరి నారాయ‌ణ గారు నాకు మంచి ఆప్తులు. న‌చ్చింది గాళ్ ఫ్రెండ్ బాగా వ‌స్తుంద‌ని తెలిసింది. ఈ సినిమా విజయం సాధించాలంటూ టీం అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.

  హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. రోహిత్‌తో క‌లసి ప్రెండ్ షిప్ డే సాంగ్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా యూనిట్‌లో దాదాపు అంద‌రూ నాకు చాలా కాలంగా తెలుసు. నచ్చింది గర్ల్ ఫ్రెండూ క‌థ‌, క‌థ‌నాలు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. గురు ప‌వ‌న్ చాలా టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు. ఈ పాట మంచి హిట్ అవుతుంద‌ని నా న‌మ్మ‌కం. సినిమా టీం అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.

  సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. పాడుతున్న‌ప్పుడే చాలా ఎంజాయ్ చేసాను. దోస్త్ లంద‌రికీ ఇది ఒక ఆంథెమ్ సాంగ్ అవుతుంద‌ని నా న‌మ్మ‌కం. ఈ పాట నాకు ఇచ్చిన మ్యూజిక్ ద‌ర్శ‌కుడు గిఫ్ట‌న్‌కు ద‌ర్శ‌కుడు గురు ప‌వ‌న్కు థ్యాంక్స్ అన్నారు.

  నటీ నటులు: ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్, మధునందన్, సీనియర్ హీరో సుమన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు
  సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహార్
  మ్యూజిక్: గిఫ్టన్
  ఎడిటర్: సాగర్ ఉడగండ్ల
  ఆర్ట్: దొలూరి నారాయణ
  పీఆర్వో: జీయస్ కే మీడియా
  నిర్మాత: అట్లూరి నారాయణ రావు
  దర్శకత్వం : గురు పవన్

  English summary
  Bigg Boss Telugu fame and Singer Rahul Simpligunj's Friendship song of Nachchindi Girl friend unvieled by Nara Rohit, Sri Vishnu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X