బిగ్‌బాస్ విన్నరా మజాకా.. రాహుల్ క్రేజ్ ముందు యువ హీరో ఢమాల్!!
బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ ముందు యువ హీరో రాజ్ తరుణ్ ఢల్ అయిపోయాడు. రాహుల్ మాటలకు, పాటలకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే.. రాజ్ తరుణ్ కూడా షాక్ అయినట్టే కనిపించాడు. నిన్న జరిగిన ఒరేయ్ బుజ్జిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాహుల్ సిప్లిగంజ్ ఓ రేంజ్‌లో హల్చల్ చేసినట్టు తెలుస్తోంది. అది రాహుల్ హీరోగా చేసిన సినిమా ఫంక్షన్‌లా ఉందని కామెంట్లు వినిపించాయి.

రాహుల్ ఫాలోయింగ్..
బిగ్ బాస్ విన్నర్‌గా రాహుల్ క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్‌బాస్ హౌస్‌లో రాహుల్ ఎంటర్టైన్మెంట్, పునర్నవితో చేసిన చిలిపి పనులు, శ్రీ ముఖితో గొడవలు ఇలా ఎంతో ఫేమస్ చేశాయి. చివరకు మూడో సీజన్ విజేతగా నిలబెట్టాయి.

పెరిగిన అవకాశాలు..
విజేతగా బయటకు వచ్చిన రాహుల్ సిప్లిగంజ్‌కు ఆఫర్స్ వెల్లువెత్తాయి. కేవలం సింగర్‌గానే కాకుండా, నటుడిగానూ మంచి అవకాశం వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోతోన్న రంగమార్తాండ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు.

రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా..
ప్రస్తుతం రాజ్ తరుణ్ కెరీర్ ప్రమాదంలో ఉంది. ఈ హీరో విజయాన్ని చూసి చాలాకాలమైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇద్దరి లోకం ఒకటే చిత్రం బోల్తా కొట్టింది. తాజాగా ఒరేయ్ బుజ్జిగా అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న కరీంనగర్‌లో జరిగింది. ఈ వేడుకలో రాహుల్ రచ్చ చేశాడు.
Recommended Video

రాహులే నా హీరో..
రాహుల్ క్రేజ్ ముందు తలొంచిన రాజ్ తరుణ్.. అతనే నా హీరో అని అనేశాడు. రాహుల్ పర్ఫామెన్స్, ఇచ్చిన స్పీచ్ చూస్తే అది ఆయన హీరోగా చేసిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లా అనిపించవచ్చు. అక్కడికి వచ్చిన వారు సైతం రాహుల్‌ను సెల్ఫీలతో ముంచెత్తారు. ఇదంతా చూసిన వారు రాహులా మజాకా? అని అనుకున్నారట.


Click it and Unblock the Notifications











