బాండ్ పేపర్ మీద రాసిపెట్టుకోండి.. రాహుల్ కామెంట్స్ వైరల్.. ఆ నలుగురితో యాంకర్ రవి

బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్‌గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్.. ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే అతని ప్రొఫెషనల్‌లోకి జారుకుంటున్నాడు. విన్నర్ అయ్యాక చానెళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా ఉన్న రాహుల్.. పాటలు పాడేందుకు సిద్దమయ్యాడు. ప్రైవైట్ ఆల్బమ్స్‌తో ఫుల్ ఫేమస్ అయిన రాహుల్.. టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్‌గా మంచి మాస్ బీట్‌లను ఆలపించాడు. మరోమారు అలాంటి అదిరిపోయే మాస్ బీట్‌తో మన ముందుకు రాబోతోన్నాడు.

మంచి అవకాశం చేజారిపోయింది..

మంచి అవకాశం చేజారిపోయింది..

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో రాహుల్‌కు ఓ మంచి అవకాశం వచ్చింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపుతున్న రాములో రాముల సాంగ్ రాహుల్ చెంతకు చేరింది. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటంతో ఆ చాన్స్ వేరే వారికి దక్కింది. అయితే రాహుల్ చేత ఆ పాటను పాడించేందుకు తమన్ ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయిందట. దీంతో ఆ అవకాశం అనురాగ్ కులకర్ణి చెంతకు చేరింది. ఆ సాంగ్ కూడా ట్రెండీగా మారింది.

తాజాగా అనూప్ రూబెన్స్ దర్శకత్వం

కార్తీకేయ హీరోగా వస్తోన్న 90ఎమ్ఎల్ సినిమాలో ఓ ఫెంటాస్టిక్ మాస్ బీట్‌ను రాహుల్ చేత పాడించబోతోన్నట్లు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ప్రకటించాడు. ఆ పాట పాడటానికి రాహుల్ స్టూడియోకు వచ్చాడు. బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచినందుకు రాహుల్ చేత కేక్ కట్ చేయించారు.

బాండ్ మీద రాసిపెట్టుకోండి..

బాండ్ మీద రాసిపెట్టుకోండి..

అనంతరం రాహుల్ మాట్లాడుతూ బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక నేను పాడుతున్న మొదటి పాట ఇది.. బాండ్ పేపర్ మీద రాసిపెట్టుకోండి.. సింగిల్ సింగిల్ అంటూ సాగే బ్లాస్ట్ అవుతుందంటూ తెలిపాడు. మరి అసలే తమన్ తన పాటలతో ట్రెండ్ సృష్టిస్తున్నాడు. వాటిని తట్టుకుని నిలబడేలా అనూప్ ఓ గట్టి ట్యూన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

 ఆ నలుగురు ఎంతో ఫేమస్..

ఆ నలుగురు ఎంతో ఫేమస్..

బిగ్‌బాస్ హౌస్‌లో మొదటి నుంచి ఓ గ్యాంగ్‌గా ఏర్పడిన వరుణ్, వితికా, పునర్నవి, రాహుల్ ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఈ నలుగురికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా.. ప్రత్యేకంగా ఈ గ్యాంగ్‌ను ఇష్టపడే వారూ ఉన్నారు. వీరి మధ్య ఉండే కెమిస్ట్రీ, ఎంత పోట్లాడుకున్న చివరకు కలసిపోవడం, స్నేహం, కోపం, ప్రేమ, అలకలు ఇలా ప్రతీ ఎమోషన్‌లో ఈ గ్యాంగ్ ప్రత్యేకంగా నిలిచింది.

Recommended Video

Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
 ఇంటర్వ్యూ చేయనున్న యాంకర్ రవి..

ఇంటర్వ్యూ చేయనున్న యాంకర్ రవి..

ఇంత వరకు కంటెస్టెంట్లందరూ వేర్వేరుగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. వరుణ్ వితికా ఇద్దరు కలిసి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ మొదటిసారి ఆ నలుగురిని ఒకే వేదికపైకి పట్టుకొచ్చి యాంకర్ రవి ప్రశ్నలు సంధించబోతోన్నాడు. మరి ఈ ఇంటర్వ్యూ కచ్చితంగా ప్రత్యేకంగా ఉండబోతోందన్నది తెలుస్తూనే ఉంది. నేటి సాయంత్రం తన యూ ట్యూబ్ చానెల్‌లో ప్రసారం కానున్నట్లు యాంకర్ రవి పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X