ప్రేమికుల రోజున పునర్నవి-రాహుల్.. అదే కారణం.. వైరల్‌గా మారిన పిక్
Recommended Video

బిగ్‌బాస్ షో పుణ్యమా అంటూ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు, పునర్నవి రాహుల్, వరుణ్ సందేశ్, వితికాలకు ఫుల్ క్రేజ్ వచ్చింది. వీరి కెరీర్‌లో షోలో పార్టిసిపేట్ చేయక ముందు చేసిన తరువాత అనే రేంజ్‌కు మారిపోయింది. మరీ ముఖ్యంగా రాహుల్, పునర్నవిలకైతే ఎక్కడా లేని ఫేమ్ వచ్చింది. మరి ఆ షోలో వీరిద్దరు పుట్టించిన సెగలు, జరిపిన కెమిస్ట్రీ అటువంటింది. తాజాగా మరోసారి వీరు కలిశారు.

కెమిస్ట్రీ హైలెట్..
బిగ్‌బాస్ మూడో సీజన్ నడిచినంత కాలం సోషల్ మీడియాలో వీరిద్దరి హవానే కొనసాగింది. వీరిద్దరిపై ఎన్ని రకాల మీమ్స్, ట్రోల్స్ జరిగాయో అందరం చూశాం. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని నాగార్జున ఉప్పు అందియ్యడం.. లేదని వీరిద్దరూ దాటేయడం జరుగుతూనే వచ్చింది. బయటకు వచ్చాక మీడియా వారు అడిగినా.. తామిద్దరం మంచి స్నేహితులమేనని క్లారిటీగా చెప్పేశారు.
కలిస్తే చాలు హాట్ టాపిక్..
రాహుల్-పునర్నవి కలిస్తేనే అది హాట్ టాపిక్‌గా మారుతుంది. మామూలు రోజుల్లోనే కలిస్తే అలా ఉంటే ప్రేమికుల రోజున కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అవును వీరిద్దరు ప్రేమికుల రోజున కలిశారు. అయితే వీరిద్దరితో పాటు వరుణ్ వితికా కూడా ఉన్నారు.

ఫుల్ ఎంజాయ్..
వాలెంటైన్స్ డే రోజున వీరంతా కలిసి ఫుల్ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. నలుగురు కలిసి ముచ్చట్లు పెడుతున్నట్లు, ఫోన్‌లో ఏదో చూసి మాట్లాడుకుంటూ ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీరంతా కలిసి సిద్ శ్రీరామ్ లైవ్ కాన్సర్ట్‌కు వెళ్లి రాత్రంతా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది.

చిన్న విరామం కూడా..
పునర్నవి హీరోయిన్‌గా వచ్చిన తాజా చిత్రం ఒక చిన్న విరామం. ఈ మూవీ ప్రీమియర్ షోను వరుణ్ సందేశ్, వితికాలు చూసినట్టు తెలిపారు. సినిమా చూసిన అనంతరం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెబుతూ.. పునర్నవికి, చిత్రయూనిట్‌కు కంగ్రాట్స్ అంటూ పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











