ఆ దుస్తుల్లో నైట్ పార్టీ ఎంజాయ్ చేసిన రాహుల్, పునర్నవి.. రొమాంటిక్ మూడ్.. వీడియో వైరల్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్‌గా భారీ పాపులారిటీ సంపాదించాడు రాహుల్ సిప్లిగంజ్. ఇదే షోలో కంటిస్టెంట్‌గా స్పెషల్ అనిపించుకుంది పునర్నవి. ఇక షోలో ఈ ఇద్దరి మధ్య నడిచిన కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి క్లోజ్ రిలేషన్‌ యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో షో తర్వాత కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్న ఈ జోడీ తాజాగా ఓ రొమాంటిక్ కిక్ ఇచ్చింది. వివరాల్లోకి పోతే..

 రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి రిలేషన్.. అప్పటి నుంచే

రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి రిలేషన్.. అప్పటి నుంచే

బిగ్ బాస్ షో ప్రారంభం నుంచే దగ్గరైన రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి ఇద్దరూ చాలా క్లోజ్ రిలేషన్ మెయిన్‌టైన్ చేయడం చూసాం. అందుకే రాహుల్, పునర్నవిలకు ఫాలోయింగ్ కూడా అంతకంతకూ పెరుగుతూ వచ్చేసింది. ఈ జంట ఆట, పాట, టాస్క్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ పాపులారిటీ క్యాచ్ చేసుకునేలా పలు ఈవెంట్స్‌లో వీరిని ప్రత్యేక ఆకర్షణ చేస్తున్నారు.

రాహుల్, పునర్నవి మధ్యలో.. ఓ పార్టీలో డాన్స్

రాహుల్, పునర్నవి మధ్యలో.. ఓ పార్టీలో డాన్స్

మరోవైపు రాహుల్, పునర్నవి మధ్యలో ఏదో జరుగుతుందని సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి. తమ మధ్య అలాంటిదేమీ లేదని రాహుల్, పునర్నవిలు చాలా సందర్బాల్లో క్లారిటీ ఇచ్చేశారు కూడా. ఇదిలా ఉంటే అలాంటి రూమర్స్ పట్టించుకోకుండా తాజాగా జరిగిన ఓ పార్టీలో రొమాంటిక్ డాన్స్ చేసి ఆకట్టుకున్నారు రాహుల్, పునర్నవి.

రంగమార్తాండలో రాహుల్.. రాజశేఖర్ కూతురు

రంగమార్తాండలో రాహుల్.. రాజశేఖర్ కూతురు

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ' మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రముఖ నటి రమ్యకృష్ణ, బ్రహ్మనందంతో పాటు రాహుల్ కూడా నటిస్తున్నాడు. రాహుల్‌కు జోడిగా శివాత్మిక రాజశేఖర్ నటిస్తోంది.

పార్టీ చేసుకున్న టీం.. ఆ దుస్తుల్లో రాహుల్, పునర్నవి

పార్టీ చేసుకున్న టీం.. ఆ దుస్తుల్లో రాహుల్, పునర్నవి

కాగా 'రంగమార్తండ' టీమ్ అంతా కలిసి ఓ పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో రాహుల్- పునర్నవి జోడీగా అదరగొట్టారు. బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో రొమాంటిక్ డాన్స్ చేసి కిక్కిచ్చారు. రాహుల్ పాడుతుండగా.. పున్ను ఆడింది. ఈ వీడియోను రాహుల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

పార్టీల్లో పున్నుతో కలిసి ఎంజాయ్..

అప్పట్లో బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న మరుక్షణమే పునర్నవితో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు రాహుల్. ఓ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ పార్టీలో వరుణ్ సందేశ్, వితిక షేరు, పునర్నవి, రాహుల్ ఫుల్ హంగామా చేసేశారు. ఆ తర్వాత కూడా పునర్నవితో రాహుల్ చాలా పార్టీలు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X