మహేష్ బాబు - విజయ్ దేవరకొండను కలిసిన డైరెక్టర్స్ కాంబో.. ఆ ఇద్దరు ఒప్పుకుంటే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇప్పుడు కంటెంట్ స్టైల్ ను మార్చారు. ఒకప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే చాలు సినిమా హిట్టవుతుందని నమ్మకంతో వర్క్ చేసేవారు. కానీ ఇప్పుడు కమర్షియల్ పాయింట్స్ ఎంత ఉన్నా కూడా కొత్త తరహా కంటెంట్ ఎదో కావాలని కోరుకుంటున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వస్తే దర్శకులు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని చూడకుండా సినిమా చేయడానికి ఒప్పేసుకుంటున్నారు. ఇక మహేష్ - విజయ్ దేవరకొండలతో సినిమాలు చేయాలని ఓ దర్శకుల ద్వయం ఎదురుచూస్తోంది.

రాజ్ అండ్ డీకే
బాలీవుడ్ లో ప్రస్తుతం రాజ్ అండ్ డీకే అనే డైరెక్టర్స్ కాంబో పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు దర్శకులు ఒకేసారి కెరీర్ ను స్టార్ట్ చేసి ఒక అడుగులలో నడుస్తున్నారు. సినిమా అయినా వెబ్ కంటెంట్ అయినా సరే సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. గో గోవా గాన్ అనే సినిమాతోనే వీరు ఎక్కువగా క్రేజ్ అందుకున్నారు.

తెలుగు వారే..
ఆ తరువాత స్త్రీ అనే హారర్ కామెడీ సినిమాతో వారి లెవెల్ ను మరింత పెంచుకున్నారు. ఓ స్త్రీ రేపురా అనే కాన్సెప్ట్ తోనే ఆ సినిమాను తెరకెక్కించారు. నిజానికి ఈ ఇద్దరు కూడా తెలుగు వారే. మొదట్లో తెలుగులో ప్రయత్నాలు చేశారు గాని వర్కౌట్ కాలేదు. బాలీవుడ్ లో మాత్రం గ్యాప్ లేకుండా హిట్స్ అందుకున్నారు.

వెబ్ సిరీస్ లతో..
ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కూడా ఈ ఇద్దరికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. సీజన్ 2 కుడా త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల కాబోతోంది. ఇక సినిమా బండిని నెట్ ఫ్లిక్స్ లో ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేశారు. ఆ మూవీ కూడా మంచి రేటింగ్స్ తో నెట్ ఫ్లిక్స్ టాప్ ట్రెండ్ లిస్ట్ లో చేరింది.

మహేష్ - విజయ్ దేవరకొండలతో సినిమాలు..
ఇక త్వరలోనే రాజ్ అండ్ డీకే మహేష్ బాబు ఆలాగే విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ తో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే వారిద్దరికీ కథలు వినిపించారట. ముందుకు ఎవరు ఒప్పుకుంటే వాళ్ళతో సినిమాను స్టార్ట్ చేయడానికి సిద్ధాంగా ఉన్నట్లు చెప్పారు. అదే విధంగా షారుక్ ఖాన్ తో కూడా సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications











