సమంత పక్కన కూర్చోలేకపోయా... రాజ్ నిడిమోరు పిన్ని షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత రెండో పెళ్లి వ్యవహారంతో చిత్ర పరిశ్రమకు షాక్ తగిలింది. గత కొంతకాలంగా రాజ్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న సమంత ఇంత పనిచేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో రాజ్‌ని పెళ్లాడారు సమంత. పెళ్లిలోనూ పురాతన కాలం నాటి విధానాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అత్తారింటిలో అడుగుపెట్టిన సమంతకు అక్కడ గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ఇక పెళ్లయినప్పటికీ హనీమూన్ ప్లాన్ చేసుకోకుండా తిరిగి సెట్‌లో అడుగుపెట్టి శెభాష్ అనిపించుకున్నారు. కాగా.. రాజ్ - సమంతల పెళ్లిపై రాజ్ నిడిమోరు పిన్ని, ప్రముఖ సంగీత విధ్వాంసురాలు శోభరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
శోభరాజుకు పద్మశ్రీ పురస్కారం
శోభరాజు అక్క కొడుకే రాజ్ నిడిమోరు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రాజ్ నిడిమోరు - సమంతల పెళ్లి నేపథ్యంలో రాజ్ తరపు బంధువులు, కుటుంబ సభ్యులు, ఆయన కుటుంబ నేపథ్యంపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మీడియా కూడా ఇదే అంశంపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఈ క్రమంలోనే శోభరాజు ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

రాజ్ చిన్నవయసులోనే పాటలు పాడాడు
నాకు గురువు లాంటి అక్కయ్య రామాదేవి. ఆమె కొడుకే రాజ్. సమంత - రాజ్‌ల పెళ్లి ఓ ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆశ్రమంలో ఒక స్వామిజీ గైడెన్స్‌లో పెళ్లి జరగడం ఆనందంగా ఉంది. పెళ్లికి రావాలని రాజ్, అక్క నాకు ఫోన్ చేసి పిలిచారు. రాజ్ అంటే నాకు చాలా ఇష్టం. వాడు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే ముద్దుగారే యశోద.. ఈ పాటలు నేర్చుకుని పాడేవాడు. అలాగే మ్రోగింది కళ్యాణ వీణ అనే సినిమా పాట నేను పాడుతుండటం చూసి వాడు నేర్చుకుని పాడాడు. ఆ సమయంలో మీ పిన్నమ్మ పేరు నిలబెట్టావని రాజ్‌ని మెచ్చుకున్నారు అని శోభరాజు గుర్తుచేసుకున్నారు.
సమంత పక్కన కూర్చోలేకపోయా
రాజ్ సంగీతం నేర్చుకున్నాడు. విద్యాప్రకాశానంద స్వామిజీ నిర్వహించిన భగవద్గీత పోటీలలో వాడికి, వాడి చెల్లెలికి ఇద్దరికీ అవార్డులు కూడా వచ్చాయి. అక్కా, బావగారు ఇద్దరు ఆధ్యాత్మిక సాధనలోనే ఉంటూ వాడికి కూడా విలువలు నేర్పారు. బాబుకి కూడా ఆధ్మాత్మికంగా మంచి పట్టుంది. అలాగే సమంతకు కూడా ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ ఉందని విన్నాను. నా దగ్గరకి రెండు మూడు సార్లు వచ్చింది. అప్పటికే సమంత చాలా సన్నగా ఉంది, ఆమె పక్కన కూర్చోవాలంటే నాకు సిగ్గేసింది. దాంతో నీలాగా సన్నగా అవ్వడం ఎలా అని అడిగితే రెండు మూడు ఎక్సర్‌సైజ్‌లు చెప్పింది. అవి వినగానే భయం వేసి ఇవన్నీ నేను చేయలేనని చెప్పా. ఫుడ్ విషయంలో సమంత చాలా క్రమశిక్షణతో ఉంటుంది, మూడు నెలలకు ఒకసారి ఈశా ఆశ్రమానికి వెళ్లి అక్కడ మౌనంగా సాధన చేస్తుంది. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ వాళ్లు చెప్పారు. ఆధ్యాత్మిక రంగాన్ని ఇష్టపడే అమ్మాయి.. బాబుకి భార్యగా రావడం చాలా సంతోషంగా అనిపిస్తోంది.
సమంత గంటలు గంటలు ధ్యానం చేస్తుంది
పెళ్లి భోజనం విషయంలోనూ సద్గురు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆరోగ్యానికి హానీ చేయని పదార్ధాలనే వడ్డించారు. ఆశ్రమంలో పురాతన పద్ధతులు పాటిస్తున్నారు. గోడలు కూడా పేడతో అలికి, మంచినీళ్లు తాగడానికి రాగి గ్లాసులు పెట్టారు. అక్కడి నుంచి వెళ్లేటప్పుడు పర్ఫ్యూమ్స్ ఇచ్చారు. అవి కెమికల్‌తో కాకుండా పూలతో తయారు చేశారు. బాబు జీవితానికి సంబంధించిన విషయాలు అక్కయ్య.. నాతో ఎక్కువగా షేర్ చేసుకుంటుంది. సమంత 3 గంటలపాటు అలవోకగా మెడిటేషన్ చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్లిపోవడం నాకే ఆశ్చర్యం కలిగించింది. ఆ అమ్మాయి అంత బిజీ ఆర్టిస్ట్‌గా ఉండి ఇన్ని గంటలు చేస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్లిద్దరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లి ఇంకా మంచి మంచి సినిమాలు వాడు తీయాలని కోరుకుంటున్నా. ప్రపంచంలోని ఐదుగురు బెస్ట్ డైరెక్టర్స్‌లో ఒకడిగా బాబు పేరు తెచ్చుకున్నాడు. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటూ మంచి క్రియేటివ్ వర్క్స్ మనకి అందించాలని కోరుకుంటున్నానని శోభరాజు అన్నారు.


Click it and Unblock the Notifications











